వ‌రుస హిట్లతో జోరుమీద ఉన్న స‌మంత ఇక నుండి టాల‌వుడ్‌కి దూరం కాబోతుంది. టాలీవుడ్‌లో మ‌రో రెండు సంవత్సరాల వ‌ర‌కూ స‌రిప‌డ మూవీల‌ను చేతిలో పెట్టుకుంది. ఆ త‌రువాత మాత్రం ఇక నో టాలీవుడ్ అంటుంది. కార‌ణం అంటూ ప్రత్యేకంగా ఏమిలేదు. స‌మంత ఎన్నాళ్ళ నుండో వేచిచూస్తున్న బాలీవుడ్ ఆఫ‌ర్స్‌, ఈ అమ్మడిని వెతుక్కుంటూ వ‌స్తున్నాయి. అత్తారింటికిదారేది స‌క్సెస్ త‌రువాత స‌మంత పేరు బాలీవుడ్ వ‌ర‌కూ వెళ్ళింది. ఒకప్పుడు త‌ను బాలీవుడ్‌లో న‌టిస్తానంటే ఎవ‌రూ ప‌ట్టించుకోని వారు, ఇప్పుడు మాత్రం స‌మంత బాలీవుడ్ ఎంట్రికి వెల్‌కం చెబుతున్నారు.

దీనికి సంబంధించిన అఫిషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ త్వర‌లోనే వెల్లడికానుంది. 2014వ సంవ‌త్సరంలో స‌మంత బాలీవుడ్ మూవీకు సంబంధించిన షూటింగ్స్‌లో పార్టిసిపెట్ చేయ‌డం ఖాయం అంటున్నారు. రీసెంట్‌గానే బాలీవుడ్‌లో ఓ బ‌డా ప్రొడ‌క్షన్ నుండి స‌మంత‌కు కాల్ వ‌చ్చింది. బొంబేకు వ‌స్తే ట్రైల‌ర్ షూట్ ఉంటుంది. ఆ మూవీకు సంబంధించిన అగ్రిమెంట్స్‌ను కూడ మాట్లాడుకోవ‌చ్చు అని అన్నారంట‌. దీంతో స‌మంత ఆనందానికి అంతేలేదు. కాని ఈ విష‌యాన్ని స‌మంత అప్పుడే బ‌య‌ట‌కు చెప్పాల‌నుకోవ‌టం లేదు. త‌నుబాలీవుడ్‌కి వెళుతున్నానంటే టాలీవుడ్‌లో త‌న మార్కెట్ త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని, అంతా క్లియ‌ర్ అయ్యాక వివ‌రాలు బ‌య‌ట‌కు చెబితే బెట‌ర్ అని అనుకుంటుంద‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: