యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యంలో బాబి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జైల‌వ‌కుశ సినిమా న‌ట‌నాప‌రంగా ఎన్టీఆర్‌లోని మ‌రో కోణాన్ని స‌రికొత్త‌గా ఆవిష్క‌రించింది. ముఖ్యంగా ఆ సినిమాలోని జై క్యారెక్ట‌ర్‌లో ఎన్టీఆర్ న‌ట‌విశ్వ‌రూపం చూపించాడు. ఈ సినిమాలో సూప‌ర్ పాపుల‌ర్ సాంగ్‌నే ఇప్పుడు ఎన్టీఆర్ అన్న క‌ళ్యాణ్‌రామ్ సినిమా టైటిల్‌గా వాడుకుంటున్నాడు.


జైల‌వ‌కుశ సినిమాను స్వ‌యంగా త‌న ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై క‌ళ్యాణ్‌రామ్ నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో రావ‌ణా... అనే సాంగ్ బాగా పాపుల‌ర్ అయ్యింది. ఇప్పుడు ఆ పాట ప‌ల్ల‌వితో వ‌చ్చే రావ‌ణ‌నే క‌ళ్యాణ్‌రామ్ త‌న కొత్త సినిమా టైటిల్‌గా వాడుకుంటున్నాడ‌ట‌. మల్లిడి వశిష్ట అనే కొత్త దర్శకుడు ఇచ్చిన కథతో కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. 


క‌ళ్యాణ్ మార్కెట్‌తో పోలిస్తే కాస్త ఎక్కువ బ‌డ్జెట్ అయ్యే ఈ సినిమా క‌థ ఫైన‌ల్ స్టేజ్‌లో ఉంద‌ట‌. ఈ సినిమాకు రావ‌ణ టైటిల్ క‌రెక్టుగా యాప్ట్ అవుతుంద‌ని ద‌ర్శ‌కుడు భావిస్తున్నాడ‌ట‌. గతంలో ఈ సినిమాకు తుగ్లక్ అనే టైటిల్ వినిపించింది. ఇప్పుడు ఆ టైటిల్ కంటే రావ‌ణ అయితేనే ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటుంద‌ని యూనిట్ భావిస్తుండ‌డంతో రావ‌ణ టైటిల్ ఫైన‌లైజ్ అవ్వ‌వ‌చ్చంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: