ప్రపంచమంతా ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా చేసిన సినిమా బాహుబలి. అంతటి బాహుబలి సినిమా తరువాత 400 కోట్లు భారీ పెట్టుబడితో నిర్మితమవుతున్న సినిమా 'సాహూ'. ఈ సినిమా కోసం కేవలం తెలుగు ప్రజలు మాత్రమే ఎదురుచూడటం లేదు.. ప్రపంచమంతా ఈ సహోపైన ఒక్క కన్నువేసి పర్యవేక్షిస్తుంది.  అంతటి ఈ సినిమా వచ్చే నెల (ఆగస్ట్) 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. దీంతో సినిమా ఫస్ట్ లుక్ నుంచి ప్రేమోషన్స్ సోషల్ మీడియా ద్వారా ఓ రేంజ్ లో చేసింది.


ప్రభాస్ ఉన్నట్టుండి ఒక్కసారిగా సోషల్ మీడియాలో యక్టీవ్ అయ్యి  "హేయ్ డార్లింగ్స్" అంటూ వచ్చి సర్ప్రైజ్ ల ఫస్ట్ లుక్ విడుదల చేసి వెళ్ళాడు. మరి కొద్ది రోజులకు యువి క్రియేషన్స్ ముందుకు వచ్చి రంజాన్ కానుకగా మీకోసం సాహూ టీజర్ రిలీజ్ చేసి వెళ్లారు. ఇప్పుడు కొత్తగా సరికొత్తగా సాహూ పాటపై "ప్రభాస్ అభిమానులకు ప్రశ్న వేసింది యూవీ క్రియేషన్స్".


ఆ ప్రశ్న ఏంటంటే "ప్రభాస్ కి మీరు నిజంగా వీరాభిమానుల ? అయితే ఇది కనుకోండి చూద్దాం అంటూ ప్రశ్న వేశారు.. కొన్ని అక్షరాలు ఇచ్చి మిస్సింగ్ లెటర్స్ ఆట ఆడారు.. ప్రభాస్ సాహూ నుంచి కొత్త పాట విడుదల తేది ఖరారు అని? ఆ పాటా పేరు ఏంటో చెప్పుకోండి చూద్దాం ? అని ప్రశ్న వేశారు.. ఈ ప్రశ్నకు సమాధానం నెటిజన్లు ఓ రేంజ్ లో చెప్పారనుకోండి.. అయితే పాటా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కొద్దీ సమయంలోనే తెలియనుంది. ఈ ఫస్ట్ పాటతో ప్రభాస్ అభిమానులకు పండగే...


ఇంతటి భారీ చిత్రానికి యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించగా ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ద కపూర్ కథానాయకగా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: