సమంతతో టాలీవుడ్ యంగ్‌హీరో స‌వాల్ చేస్తున్నాడు. ఈ స‌వాల్‌లో అత‌డు గెలుస్తాడా ?  బొక్క బోర్లా ప‌డ‌తాడా ? అన్న‌ది ఇప్పుడు ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా ఉంది. స‌మంత న‌టించిన ఓ బేబీ సినిమా రేపు శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సమంత -నందిని రెడ్డి కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఓ బేబీ టీజ‌ర్‌, ట్రైల‌ర్లు సినిమాపై చాలా ఆస‌క్తిని రేకెత్తించాయి. 


దీనికి తోడు ఈ సినిమాను రిలీజ్ చేస్తోన్న సురేష్ బాబు మంచి డేట్ చూసుకోవ‌డం, స‌మంత ప్ర‌మోష‌న్స్‌, ప్రి రిలీజ్ బిజినెస్ ఓ బేబీపై మంచి అంచ‌నాలు పెంచేశాయి. నిన్నటివరకు ఓ బేబీ కి శ్రీహరి కొడుకు రాజ్ దూత్, ఆది సాయి కుమార్ బుర్రకథలు పోటీకి వస్తాయనుకున్నారు. ఇప్పుడు శ్రీహ‌రి త‌న‌యుడు రాజ‌దూత్ సినిమా వాయిదా ప‌డింది. ఇప్పుడు ఆది సాయికుమార్ బుర్రకథతో సమంతకి పోటీకి వస్తున్నాడు. 


ఆది ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రుస‌గా డిజాస్ట‌ర్ల మీద డిజాస్ట‌ర్లు ఇస్తున్నాడు. అత‌డికి హిట్ ఇచ్చి చాలా రోజులు అయ్యింది. మ‌రోవైపు స‌మంత పెళ్లి త‌ర్వాత కూడా హిట్లు మీద హిట్లు కొడుతోంది. ఇలాంటి టైంలో స‌మంత సినిమాతో ఆది పోటీ అంటే కాస్త రిస్కే. ఇప్ప‌టికే బుర్ర‌క‌థ రెండు సార్లు వాయిదాలు ప‌డి రేపు రిలీజ్ అవుతోంది. ప్రమోషన్స్ లో బుర్రకథ టీం ఓ బేబీ కన్నా వెనుకబడే ఉన్నారు. మ‌రి ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో ?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: