ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో   రుపొందుతున్న  ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని  అక్టోబరు 2న  గాంధీ జయంతి సందర్భంగా  విడుదల చెయ్యాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. ఇక ఈ సినిమా మొత్తంలో మెగాస్టార్ పాత్ర తరువాత  మరో పాత్రకి కూడా ప్రత్యేకమైన గుర్తింపు వస్తోందట. ఆ పాత్రలోనే అనుష్క నటించిదట. అయితే మొదట ఈ సినిమాలో అనుష్క పాత్ర  స్టోరీ టెల్లర్ గా ఉంటుందని వార్తలు వినిపించాయి. కానీ  తాజాగా అనుష్క  సైరాలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో నటించనుందని రెండు రోజులు నుంచీ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.  అయితే తాజా సమాచారం ప్రకారం ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదట. అసలు ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయే లేదట.    


సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో   సుదీప్, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు వంటి స్టార్ లు నటిస్తున్నారు.  అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా  సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో  హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న  ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో  విడుదల చేయనున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: