అతి త్వరలో స్టార్ మా ఛానల్ లో ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 3 కి ఆదిలోనే హంస పాదు ఎదురైనట్లు నేడు కొన్ని మీడియా మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. నిజానికి గత రెండు సీజన్లలో టివి స్టార్స్ సహా కొందరు సినిమా సెలెబ్రిటీలు సైతం ఆ షోలో పాల్గొన్నారు. అయితే త్వరలో ప్రారంభం కాబోయే సీజన్ 3 పై ఎక్కువగా సెలెబ్రిటీలు ఆసక్తి చూపడం లేదనేది ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్త సారాంశం. దానికి కారణం కూడా లేకపోలేదట, 

మొదటి సీజన్ లో విన్నర్ గా నిలిచిన శివ బాలాజీకి మొదట్లో బ్రహ్మరథం పట్టిన మీడియా ఛానల్స్, మెల్లగా అతడిని పక్కకు పెట్టేశాయి. అంతేకాదు ఆ విజయం తరువాత అతడికి సినిమా ఛాన్స్ లు కూడా వస్తాయని అందరూ భావించారు, కానీ అదేమి జరుగలేదు. ఇక మొన్నటి సీజన్ 2 గెలిచిన కౌశల్ విషయంలో కూడా అదే జరిగింది. అతడిని గెలిచిన తరువాత విపరీతంగా హైలైట్ చేసిన మీడియా ఛానల్స్, ఇటీవల పూర్తిగా అతడిని పట్టించుకోవడమే మానేశాయి. అంతేకాదు అప్పట్లో కౌశల్ హీరోగా సినిమాలు తీస్తామని పలువురు ముందుకు రావడం జరిగింది. 

అయితే ఇప్పుడు ఎక్కడా కూడా ఆ వార్తలు వినపడకపోవడం ముఖ్య కారణం అని అంటున్నారు. దీన్నిబట్టి బిగ్ బాస్ లో తమను తీసుకున్నాక, ఇంట్లోని వాళ్ళను వదిలి 100 రోజలు పాటు బిగ్ బాస్ హౌస్ లో ఎన్నో కష్టనష్టాలు పడి, చివరికి టైటిల్ గెలిచినా పెద్దగా ఉపయోగం ఉండదని భావించి కొందరు సెలబ్రిటీస్ ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి ముందుకు రావడం లేదట. అయితే ప్రస్తుతం విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు. మరి వీటికి అడ్డుకట్ట వేసేలా బిగ్ బాస్ టీమ్ నుండి ఒక ప్రకటన వస్తేనే కానీ అసలు నిజాలు బయటకు రావు.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: