బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వయసుతో సంబంధం లేకుండా చేలకిగా, చక్కగా చాలెంజింగ్ క్యారెక్టర్స్ పాత్రల్లో చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. గత 50 సంవత్సరాలుగా 'సినీ కెరీర్'లో మొదటి స్థానంలో ఉంటున్న అమితాబ్ బచ్చన్, వృద్దుడు అయినా ఎన్నో మంచి మంచి సినిమాలు తీసి బాలీవుడ్ కి ప్రాణం పోస్తున్నారు. ఇప్పుడు కూడా అలంటి చాలెంజింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ కథనాయకుడిగా, సుజిత్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'గులాబో సితాబో'. 


ఈ సినిమాలోని అమితాబ్ గెటప్‌‌కి సంబంధించిన లుక్ గత నెల రిలీజ్ అయ్యి అభిమానులకు షాక్ ఇస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. పొడవాటి గెడ్డం, బారు ముక్కు, కళ్లద్దాలతో వృద్ధుడిగా కనిపిస్తున్నా అమితాబ్ ను చూసి అభిమానులంతా షాక్ అయ్యారు. ఈ గెటప్ కోసం అమితాబ్ బచ్చన్ అష్ట కష్టాలు పడుతున్నారట. ప్రోస్థెటిక్ మేకప్ వేసినప్పటికీ మేకప్ వేసేటప్పుడు, తీసేటప్పుడు అమితాబ్ అలసిపోయేవారట. 


అయితే ఈ సినిమాలో పొడవాటి గెడ్డం, బారు ముక్కు, కళ్లద్దాలతో వృద్ధుడిగా కనిపించడానికి దాదాపు 3 గంటల పాటు అమితాబ్ బచ్చన్ మేకప్ వేసుకుంటున్నారట. ఈ విషయాన్నీ తన ట్విట్టే ఖాతాలో వెల్లడించారు. అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ లో ''ఈ లుక్ కోసం నాకు ప్రతిరోజూ మూడు గంటల పాటు మేకప్ వేసేవారని, మేకప్ అంతా పూర్తయిన తర్వాత నా పరిస్థితి ఇదీ అంటూ.. తన గెటప్ కు సంబంధించిన ఫొటోలను, మేకప్ రూమ్ లో తీసిన ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు''. ఈ ఫోటోలను చుసిన అభిమానులు 'మీరు గ్రేట్ బిగ్ బి' ఈ వయసులో కూడా ఇంతలా కష్టపడుతున్నారు అంటూ ట్విట్స్ చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: