రకుల్ కు ఒక వింత అనుభవం ఎదురైంది. కారులోనుంచి దిగిన రకుల్ కు బెగ్గర్స్ బాగా ఇబ్బంది పెట్టసాగారు. హోటల్ నుంచి బైటకు వచ్చే సమయంలో ఆమెను కొంతమంది బిచ్చగాళ్ళు చుట్టుముట్టి డబ్బు ఇవ్వాలని రచ్చ చేశారు.  ఆమెను కారువైపు వెళ్ళనివ్వకుండా అడ్డంనిలుస్తూ డబ్బు ఇవ్వాలని వేధించసాగారు. దీంతో ఏం చేయాలో పాలుపోక రకుల్ బిక్కమొహం వేసింది.


కొందరు బిచ్చగాళ్ళు ఆమెను తాకుతూ ఇబ్బంది పెట్టడంతో ఆగండి.. ఆగండి అంటూ సైగ చేస్తూ కారు డోర్ వైపు నడిచింది. ఇంతలో రకుల్ ఇబ్బందిని గమనించిన ఒక వ్యక్తి అక్కడకు వచ్చి వాళ్ళకు పక్కకు పంపి రకుల్ కారు ఎక్కేవరకూ పక్కనే నిలబడ్డాడు.  రకుల్ కారు ఎక్కిన తర్వాత కూడా ఒక బెగ్గర్ కారు లోపల చేతులు పెట్టి మరీ వేధించడం గమనార్హం.  ఈ వ్యవహారం చూస్తే 'పోకిరి' సినిమాలో బ్రహ్మానందం-అలీ ఎపిసోడ్ గుర్తు రాక మానదు.


ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఎక్కువమంది రకుల్ ను సపోర్ట్ చేశారు.  బిచ్చగాళ్ళు వేధిస్తున్నా రకుల్ ఎంతో సహనంగా ఉందని మెచ్చుకున్నారు.  ప్రభుత్వం బిచ్చగాళ్ళను కంట్రోల్ చేయాలని ఒకరు కామెంట్ చేస్తే.. బిచ్చగాళ్ళ బెడద ఎక్కువైందని.. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర దాదాపు చాలామంది ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: