దక్షిణాది సినిమా రంగంలో తనకంటూ సపరేట్ క్రేజ్ ఏర్పరుచుకున్న సంచలన హీరోయిన్ నయనతార ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. తన పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఉండే సినిమాలకు మాత్రమే నయనతార గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇదిలావుండగా తాజాగా నయనతార కి గట్టి పోటి ఇవ్వటానికి అక్కినేని కోడలు సమంత రెడీ అయినట్లు తెలుస్తోంది.


ఇటీవల నందినీరెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలు పోషించిన ఓ బేబీ సినిమా విడుదలయ్యే సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో నటిగా తన స్థాయిని పెంచుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర రగడ సృష్టిస్తోంది. తాజాగా విడుదలైన ఓ బేబీ సినిమా కలెక్షన్లు నిర్మాతకు మంచి లాభాలు తెచ్చి పెడుతున్నాయి. ఇదిలావుండగా నయనతార చేయాల్సిన ఓ సినిమా వైపు సమంత మొగ్గు చూపుతోందట.


గతంలో తమిళంలో వచ్చిన 'అరమ్' సినిమా సీక్వెల్ లో సమంతనటించబోతుందని సమాచారం. ఈ సినిమా తెలుగులో 'కర్తవ్యం' పేరుతో రిలీజైంది. ఆ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నారు. మొదట నయనతారే అందులో నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సమంతకు ఆ ఛాన్స్ దక్కబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద సమంత పెళ్లయిన తర్వాత లేడి ఓరియెంటెడ్ సినిమాలో నయనతారకు గట్టి పోటీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. 

 



మరింత సమాచారం తెలుసుకోండి: