కోటా శ్రీనివాసరావు అంటే ఆషామాషీ నటుడు కాదు, ఢక్కామొక్కీలు తిన్న నటుడు. కోటా వేషం కట్టాడంటే ఆ పాత్రకు జీవం రావాల్సిందే. అది అలాగే ఉందని అంతా అనుకోవాల్సిందే. నలభయ్యేళ్ళ సినీ జీవితంలో ఎన్నో పాత్రలు వేసిన కోటాకు ఎన్నో చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి.


కోటా నటుడుగా ముఖానికి రంగు పూసుకున్నది 1978 ప్రాణం ఖరీదు సినిమాలో. అందులో చిన్న వేషం వేసినకోటాకు 1985లో ప్రతిఘటన మూవీతో బ్రేక్ వచ్చింది. ఆ తరువాత ఆయన ఫుల్ బిజీ అయిపొయారు. అయితే కోటా బ్యాంక్ ఉద్యోగి. ఆయన సినిమాల్లో వేసుకుంటూ బ్యాంక్ కు అలా సెలవులు పెడుతూండడంతో ఇక లాభం లేదనుకున్న బ్యాంక్ అధికారులు కోటాను రావద్దు మహా ప్రభో అనేశారు. మీ సేవలు మాకు వద్దు అని చెప్పేశారట. దాంతో బ్యాంక్ జాబ్ కి అలా కన్నం పడిపోయింది.


నటుడుగా ఎన్నో పాత్రలు వేసి పద్మశ్రీ పురస్కరం అందుకున్న కోటా వయసు ఇపుడు  76. ఇప్పటికీ ఎన్నో పాత్రలు వేస్తానని, ఆ హుషార్ ఇంకా తనలో ఉదని చెబుతున్న కోటా శ్రీనివాసరారు ఇప్పటి నటులకు తెలియాల్సినవి చాలానే ఉన్నాయని అంటారు. వారు నేర్చుకుంటే బాగుంటుందని కూడా ఓ మీడియా ఇంటర్వ్యూలో తన మనసులోకి భావాలను  వెల్లడించారు. జీవితంలో నటనకు అంతం లేదని, కళాకారుడుగా జీవించమే గొప్ప వరమని ఆయన అంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: