‘తడం’ చిత్రం తర్వాత ‘మూడర్‌కూడం’ నవీన్‌ దర్శకత్వంలోని ‘సిరగుగల్‌’ చిత్రంలో అరుణ్‌ విజయ్‌ హీరోగా నటిస్తున్నారు. ఇందులో ఆయన విజయ్‌ ఆంటోనికి విలన్‌గా నటించారు. అలాగే ప్రభాస్‌ నటిస్తున్న ‘సాహో’లో కూడా విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. మరో వైపు హీరోగానూ నటిస్తూ బిజీగా ఉన్నారు అరుణ్‌ విజయ్‌. ఆయన ‘బాక్సర్‌’ చిత్రంలో ముష్టి యుద్ధ వీరుడిగా నటిస్తున్నారు.

 

ఈ సినిమా కోసం వియత్నాంలో నెల రోజులపాటు బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రంలో రితికాసింగ్‌, సంజనా గల్రాణి తదితరులు నటిస్తున్నారు. బాలా శిష్యుడు వివేక్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ సామాజిక మాధ్యమాల్లో లీకైంది. దీంతో వేరే మార్గం లేక చిత్ర బృందం అధికారికంగా ఆ లుక్‌లను విడుదల చేసింది.

 

ఇందులో అరుణ్‌విజయ్‌ గెటప్‌, శరీరాకృతి ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంది. దీనిపై అరుణ్‌ విజయ్‌ స్పందిస్తూ ‘ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ ఎలా లీకైందో అర్థం కాలేదు. చిత్ర బృందం పూర్తిగా ఆశ్చర్యపోతోంది. వాస్తవానికి ఈ ఫస్ట్‌లుక్‌ను భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకున్నాం. ఫస్ట్‌లుక్‌లో నా రూపం, శరీరాకృతికి దాదాపు 9 నెలలు పట్టింది.

 

అన్ని నెలల శ్రమకు చిహ్నమది. ఎక్కువ సమయం తీసుకుని నటిస్తున్న సినిమా కూడా ఇదే. నేను ప్రతి సినిమాకు 100 శాతం శ్రమిస్తా. అందుకు తగ్గ ఫలితాన్ని ప్రేక్షకులు ఇస్తున్నారు. ఈ సినిమా నాకు మరోస్థాయి గుర్తింపును ఇస్తుందన్నారు’.


మరింత సమాచారం తెలుసుకోండి: