అమెరికాలో తానా వేదికగా తెలుగు రాష్ట్రాల రాజకీయనేతలు  భేటీ అయ్యారు. బీజేపీ నేత రాం మాధవ్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ప్రస్తుతం అమెరికాలో తానా మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలకు పలువురు రాజకీయ నేతలను కూడా ఆహ్వానించారు.

 

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో ఇద్దరూ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే తమ భేటీలో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవన్నారు రాంమాధవ్. పవన్‌తో  చర్చల అనంతరం రామ్ మాధవ్ మాట్లాడుతూ, ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో పనిచేసే ఉద్దేశం లేదన్నారు.

 

అయితే పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామని చెప్పారు. పవన్ కల్యాణ్ ను స్నేహపూర్వకంగానే కలిశానన్నారు రాంమాధవ్, తమ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బలమైన రాజకీయశక్తిగా ఎదగడమే ప్రస్తుతం బీజేపీ ముందున్న లక్ష్యమన్నారు.

 

అయితే ఇటీవలే చిరంజీవి బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు రావడం.. తాజాగా రాంమాధవ్ కూడా పవన్ కల్యాణ్‌తో భేటీ అవ్వడం రాజకీయాల్లో మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. కానీ అటువంటి వేమి లేవని, జస్ట్ మామ్మూలు మీటింగ్ అని, అనవసరంగా ప్రకంప కల్పనలు వద్దని, కళ్యాణ్ మాకు చాల సన్నిహితుడని, అతను రాజకీయాల్లో విజయం పొందాలని శుభాకాంక్షలు తెలియజేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: