బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కొన్ని నెలల క్రితం ప్రియుడు నిక్ జోనస్ ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరు పెళ్లికి ముందు ఎంత ఓపెన్‌గా ర‌చ్చ చేశారో ఇప్పుడు కూడా అంతే స్థాయిలో ర‌చ్చ చేస్తున్నారు. పెళ్లి త‌ర్వాత కూడా ఈ జంట ప్రేమ‌ప‌క్ష‌ల్లా విహ‌రిస్తున్నారు. చిన్న టైం దొరికితే చాలు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ వాలిపోతున్నారు.


తాజాగా ఈ జంట ఓ ఓపెన్ ప్లేసులోనే ప్రేమ‌లో మునిగిపోయి రొమాన్స్ చేసుకుంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. యూర‌ప్‌లో భార్య ప్రియాంక‌తో నిక్ రొమాన్స్ చేసిన వీడియోను స్వ‌యంగా త‌న సోష‌ల్ మీడియా పేజ్‌లో షేర్ చేశాడు. ఈ జంట అన్యోన్య‌త చూస్తే చాలా ముచ్చ‌ట‌గా ఉంద‌ని కూడా కొంద‌రు... ప్రేమ‌కు వ‌య‌స్సు అడ్డుకాద‌ని మ‌రికొంద‌రు కామెంట్లు చేస్తున్నారు.


ఇక ప్రియాంక పెళ్లి త‌ర్వాత ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లి త‌ర్వాత నా లైఫ్‌లో ఎలాంటి మార్పు లేద‌ని.. నిక్ ను చూస్తుంటే నాకు భర్తకు భాయ్ ఫ్రెండ్ కు తేడా లేదు అనిపిస్తుంది. భర్త అయినా కూడా నాకు నిక్ బాయ్ ఫ్రెండ్ మాదిరిగానే ఉంటున్నాం. పెళ్లి తర్వాత జీవితంలో మరింత సేఫ్టీ దొరికినట్లుగా అనిపిస్తుందని ఆమె చెప్పుకొచ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి: