త్రిష ఇండస్ట్రీకొచ్చి ఇప్పటికే 18 ఏళ్ళు దాటిపోయింది. అయినా హాట్ ఫొటోలతో కుర్ర హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇస్తుంది. సినిమాలతో పాటు తరచూ వెకేషన్స్ ఎంజాయ్ చేసే త్రిష ప్రస్తుతం మాల్దీవుల్లో షికారు చేస్తోంది. అక్కడి బీచ్‌లలో తన అందాలకు పదును పెడుతూ ఫొటోలకు పోజిస్తోంది. కుర్ర హీరోయిన్లకు ఈర్ష కలిగేలా స్విమ్ సూట్‌లో యువతకు గాలం వేస్తోంది. మాల్దీవుల్లోని సముద్రపు ఒడ్డున బికినీలో అలా అలా ఎంజాయ్ చేస్తూ దిగిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది త్రిష. 


బికినీ ఫోజుల్లో త్రిష షేర్ చేసిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు 35 ఏళ్ల వయసులో ఉన్న ఈ భామ.. యంగ్ హీరోయిన్స్‌ని మించి వేడి పుట్టిస్తోంది. అయితే తన లోని హాట్‌నెస్ బయటపెట్టిన త్రిష.. ట్యాగ్ లైన్‌తో మరింత అట్రాక్ట్ కలిగించింది. 'తాను హుషారుగా ఉన్నపుడే తనను డీల్ చేయాలనేది తన సలహా' అని పేర్కొంది త్రిష.  


మాల్దీవుల్లో దిగిన ఈ తాజా ఫొటోల్లో అమ్మడి ఫిట్‌నెస్ చూస్తుంటే ఇంకో పదేళ్ల పాటు సౌత్ సినిమా హీరోయిన్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం అనిపిస్తోంది. బీచ్ ఒడ్డున గ్రీన్ డ్రెస్‌లో తీసుకున్న సెల్ఫీలో త్రిష అందాలతో పాటు వీపు భాగాన ఉన్న టాటూ ఫోకస్ అవుతోంది. ఈ పిక్స్ ఆమె అందాలను వర్ణిస్తూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు నెటిజన్లు. లైకుల వర్షం కురుస్తూ నెట్టింట వైరల్ చేసేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: