పాయల్ రాజ్ పుత్ ... సినిమా గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ పేరు బాగా తెలుస్తుంది.  చేసింది ఒక్క సినిమానే.  ఆ సినిమాతో పది సినిమాల్లో నటించిన పాపులారిటీ తెచ్చుకుంది.  గ్లామర్ గా కనిపించడమే కాకుండా అంగాంగ ప్రదర్శనకు ఏ మాత్రం అడ్డు చెప్పకపోవడం పాయల్ స్పెషాలిటీ.  


ఇప్పుడు ఈ అమ్మడు వెంకటేష్ తో వెంకిమామ, బెల్లంకొండ శ్రీనివాస్ తో టైగర్ నాగేశ్వర రావు సినిమా చేస్తున్నది.  వెంకటేష్ పక్కన డీసెంట్ పాత్ర చేస్తుంటే.. బెల్లంకొండ బాబు పక్కన మాత్రం అదిరిపోయే క్యారెక్టర్ చేస్తున్నది.  


టైగర్ నాగేశ్వర రేవులో పాయల్ బోల్డ్ నటనతో ఆకట్టుకుంటుందట.  వేశ్య పాత్రలో కనిపిస్తోంది.  దీంతో పాటు ఆమె పోలీస్ గెటప్ లో కుండా ఉంటుందట.  రెండు పాత్రలు ఏంటి.. వేశ్య పాత్రకు పోలీస్ పాత్రకు సంబంధం ఏంటి అన్నది సినిమాలోనే చూడాలి. 


వేశ్యగా చేసే సమయంలో ఆమె ఎక్స్ పోజింగ్ శృతిమించి విధంగా ఉందని, సినిమాకు ఆమె రోల్ ప్లస్ అవుతుందని టాక్.  యూత్ కు కావాల్సిన మసాలా అంతా దట్టంతా దట్టిస్తున్నారట.  ఎంత మసాలా దట్టించినా సరుకు బాగాలేకపోతే ఉపయోగం ఏముంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: