సావిత్రిగా పాపులర్ అయిన వి6 యాంకర్ జ్యోతి, ఆ ఛానెల్ నుంచి తప్పుకున్నారని లేటెస్ట్ న్యూస్. అందుకు కారణం మా టీవీ అని తెలుస్తోంది. అందుకే సావిత్రి ఇక కొన్నాళ్ల పాటు తెరమీద కనిపించరట. బిగ్ బాస్ 3 షోలో ఓ సభ్యురాలిగా వుండబోతున్నట్లు సమాచారం. అందుకు మూడు నెలలు సెలవు తీసుకోవచ్చు. కానీ ఎంతోకాలంగా వి6 ఛానెల్ లో పని చేస్తున్నందున ఇక వేరే అవకాశాలు వెదుక్కోవాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా వున్నట్లు వి6 వర్గాల నుండి అందిన సమాచారం.

అందుకే సావిత్రి వి6కు రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 21 నుంచి బిగ్ బాస్ 3 సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ షో మూడునెలల పాటు వుంటుంది. సావిత్రి అలియాస్ జ్యోతి ఈ షో ముగిసిన తరువాత కొత్త ఛానెల్ లోకి వెళ్లడమో, లేదా ప్రీలాన్సర్ గా, నటిగా అవకాశాలు వెదక్కోవడమో చేస్తారని లేటెస్ట్ న్యూస్.

ఇప్పటికే సావిత్రితో పాటు షో చేస్తున్న బిత్తిరి సత్తి సినిమాల్లో నటిస్తూ పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదేబాటలో సావిత్రి అలియాస్ జ్యోతి కూడా వెళ్లబోతున్నట్లు కనిపిస్తోంది. మరి సావిత్రి సినిమాల్లో ఎంతవరకు సక్సస్ అవుతుందో చూడాలి. ఏదేమైనా ఒక టీవీ యాంకర్ వెండితెర మీద రాణించాలంటే టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు కదా...అదృష్ఠము ఉండాలి. సరైన అవకాశాలు రావాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: