ఫస్ట్ హాఫ్ కామెడీ,మణిశర్మ మ్యూజిక్,సినిమాలో అలీ కూడా ఉన్నాడుఫస్ట్ హాఫ్ కామెడీ,మణిశర్మ మ్యూజిక్,సినిమాలో అలీ కూడా ఉన్నాడువిష్ణు డైలాగ్ డెలివరీ,పాత చింతకాయ పచ్చడి లాంటి కథ,నాలుగైదు సినిమాల కిచిడి లాంటి కథనం,ఇంకా చాలా

ఏ చిన్న హెల్ప్ చేసిన తిరిగి హెల్ప్ చేసే గుణం చిన్నా ( మంచు విష్ణు )ది అలాంటి సందర్భంలోనే చిన్న చిన్ని(లావణ్య)ని కలుస్తాడు. వాడి నేచర్ వాడి ఫ్యూచర్ ని డిసైడ్ చేసింది అన్నట్టు గానే చిన్నా , పిచ్చేస్వర రావు(వెన్నెల కిషోర్) తో కాసిన పందెం వల్ల అతని జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటుంది. ఇక్కడ నుండి కథ తిరుపతి కి మారుతుంది చిన్న పెరిగి వెంకటేశ్వర రావు గా మారి అవతార్(పోసాని) దగ్గర విలేఖరి గా చేరతాడు. అక్కడ చిన్న చేసిన స్టింగ్ ఆపరేషన్ లో మంత్రి డిల్లెస్వర రావు(పంకజ్ త్రిపాఠి ) తో చిన్నకి వైరం ఏర్పడుతుంది.

ఇదిలా ఉండగా చిన్నకి అలేఖ్య ( లావణ్య) పరిచయమవుతుంది చూడగానే అలేఖ్య తో ప్రేమలో పడ్డ చిన్నకి అలేఖ్య విశ్రాంత్(సామ్రాట్)తో ప్రేమలో ఉంటుందని తెలుస్తుంది. డిల్లిస్వర రావు ఇటు చిన్న ని అటు చిన్ని ని ఇద్దరినీ చంపడానికి ప్రయత్నిస్తుంటారు. దిల్లిస్వర రావు కి చిన్ని ని చంపాల్సిన అవసరం ఏముంది? చిన్న ప్రేమను చిన్ని ఒప్పుకుందా లేదా ? విశ్రాంత్ ఏమయ్యాడు ? అన్న ప్రశ్నలకి జవాబు తెర మీదనే దొరుకుతుంది...

మంచు విష్ణు , ఈ పేరు ఈ సినిమాలో కనిపించడమే పెద్ద మైనస్ గత చిత్రాలతో పోలిస్తే నటన బాగానే ఉన్నా డైలాగ్ డెలివరీ మాత్రం హింసాత్మకం సీరియస్ గ డైలాగ్స్ చెప్తుంటే సింపుల్ గ నవ్వుకోవాలి అనిపిస్తుంది అంటే అర్ధం అయిపోతుంది పరిస్థితి ఎలా ఉందో.. లావణ్య త్రిపాఠి , నటన పరంగా బాగా స్కోప్ ఉన్న పాత్రా అయిన తెర మీద నటనాపరంగా పరవాలేదనిపించింది ఈ చిత్రంలో చాలా అందంగా కనిపించింది. రావు రమేష్, కోట శ్రీనివాసరావు, వెన్నెల కిశోర్ ,హేమ , బ్రహ్మానందం, భరత్ , రఘు బాబు, పోసాని,సామ్రాట్ ఇలా చాలా మంది ఉన్నా అందరు స్క్రీన్ ఫిల్లింగ్ కోసమే అన్నట్టు నటించారు . పాత్రలు చాలా ఉన్నా ఎందులోనూ బలం లేదు.

కథ కథనం మరియు దర్శకత్వం వీరు పొట్ల, కథ విషయంలో కష్టపడటం అవసరం లేదు అనుకున్నదేమో పాత కథనే తీసుకున్నాడు, మంచు విష్ణు కి రాస్తున్నా అన్న విషయం మరిచిపోయి రాసిన డైలాగ్స్ బానే ఉన్నాయి కాని ప్రాస కోసం అయన పెట్టిన పరుగు ప్రేక్షకులను పరిగేట్టిస్తుంది.

దర్శకత్వం విషయంలో మాత్రమే వీరు పొట్ల సక్సెస్ అయ్యాడు. గోపి మోహన్ మరియు వీరు పొట్ల కలిసి రాసిన కథనం అసలు గ్రిప్పింగ్ గా లేదు రెండవ అర్ధ భాగంలో వచ్చే అన్ని సన్నివేశాలను ఫస్ట్ సీన్ లో నే చెప్పేయచ్చు ఇంకాస్త జాగ్రత్త తీసుకొని మరింత పట్టు ఉన్న కథనాన్ని రచించి ఉంటె పరిస్థితి మరోలా ఉండేది.

సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మణి అందించిన పాటలు వినడానికే కాదు తెర మీద కూడా చాలా బాగున్నాయి ముఖ్యంగా అయన అందించిన నేపధ్య సంగీతం చాలా సన్నివేశాలకు వెన్నుముకలా నిలిచింది. ఈ చిత్రంలో విష్ణు చేత చేయించిన ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది కాని సెకండ్ హాఫ్ లో అయన చెయ్యడానికి ఏమి లేదు పాపం.

పరిశ్రమకి వచ్చి పదేళ్ళు దాటినా ఇంకా కూడా స్థానం కోసం పోరాడుతున్న హీరో విష్ణు, ఇందుకోసం అయన చేయని ప్రయత్నం అంటూ లేదు డాన్స్ లు వేశాడు ఫైట్ లు చేసాడు సన్నం అయ్యేడు కామెడీ చేసాడు అయినా కూడా కరెక్ట్ హిట్ పడట్లేదు , ఎలా విష్ణు గారు మార్చాల్సింది ఇవి కాదు మీ డైలాగ్ డెలివరీ , డైలాగ్ లో ఉన్న పంచ్ ని మీ డెలివరీ తో "కిల్" చేసేసారు. కటితాత్ముడు అంటే కటినాత్ముడు అని అర్ధం చేసుకోడానికి అరగంట పట్టింది.

వీరు పొట్ల గారు బిందాస్ సినిమాని మళ్ళీ తీయడానికి ఇంత బడ్జెట్ ఎందుకండీ.... ఆయనకే సినిమాలు లేవు రవితేజ గారి వాయిస్ ఓవర్ ఏంటో ... సినిమాకి ఎటువంటి సహాయం చెయ్యలేదు అయన వాయిస్ ఓవర్... ట్విట్టర్ లో సినిమా అంతా తనదే అన్నంత రేంజ్ ల మాట్లాడిన వెన్నెల కిషోర్ తెర మీద తెర మీద మూడు నిమిషాలు కూడా కనపడకపోవడం ఏంటో .. ? బ్రహ్మం తెర మీద కనిపిస్తున్నాడు జనం నవ్వుతున్నారు ఎందుకని అడగకండి...

చివరగా మీకు ఒక కథ చెప్పాలి అనగనగా ఒక రాజు ఆ రాజు సినిమా తీయాలనుకున్నాడు కామెడీ సీన్ లు రాసుకున్నాడు , అన్నింటినీ కలపడానికి ఒక ఓల్డ్ స్టొరీ ని కూడా తీసుకున్నాడు అన్ని సెట్ చేసుకొని ప్రేక్షకుల మీద యుద్ధం ప్రకటించారు , అలా జరుగుతున్న యుద్ధం లో రాజు గారు ఎవరివో కాళ్ళు తగిలి కింద పడి ఓడిపోయారు .. ఈ కథలో మంచు విష్ణు ఎక్కడ ఉన్నారు అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. అక్కడ రాజుగారికి తగిలిన కాళ్ళు ఎవరిదో కాదు మన మంచు విష్ణుదే... బాగుంది అనిపించే సినిమా అయన ఒంటి చేత్తో పరవాలేదు అనిపించే స్థాయికి తీసుకెళ్ళాడు.

ఎలాగు ఏ అంచనాలు ఉండవు కాబట్టి సినిమా పరవాలేదనే అనిపిస్తుంది.... ఏదయినా అంచనాలుంటే సినిమా చూడాలని ఉంటె ముందు అంచనాలను పక్కకి నెట్టేసి సినిమాకి టిక్కెట్ కోనేయ్యండి.

Manchu Vishnu,Lavanya Tripathi,Mohan Babu,Veeru Potlaప్రేక్షకులు కూడా థియేటర్ బయటకి దూసుకెళ్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: