మహేష్ తన కెరియర్ కు సంబంధించి మొట్టమొదటిసారి ఆర్మీ ఆఫీసర్ గా ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కాశ్మీర్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈమూవీ షూటింగ్ స్పాట్ నుండి మహేష్ ఆర్మీ డ్రెస్ లో ఉన్న ఫోటో లీక్ అయింది. 

లీక్ అయిన ఈ ఫోటో కొన్ని గంటలలోనే వైరల్ గా మారిపోవడంతో ఈ ఫోటో మహేష్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. సూపర్ స్టార్ అభిమానులు ఈ లుక్ ను ఎంజాయ్ చేస్తుంటే అప్పుడే ఈ లుక్ పై సెటైర్లు కూడ మొదలైపోయాయి. 

ఆర్మీలో పనిచేసే వారి హెయిర్ స్టైల్ చాల పొట్టిగా ఉంటూ డిఫరెంట్ గా ఉంటుందని అయితే మహేష్ మాత్రం తన జుట్టును ఏమాత్రం పొట్టి చేయకుండా తన ఒరిజనల్ హెయిర్ స్టైల్ లోనే కనిపిస్తున్నాడు అంటూ కామెంట్స్ మొదలైపోయాయి. అంతేకాదు మహేష్ నటించే సినిమాల పాత్రలలో వైవిద్యం ఉంటుంది కాని అతడి లుక్ లో వైవిధ్యం కనిపించదు అంటూ మరికొందరు జోక్ చేస్తున్నారు.

బన్నీ అభిమానులు అయితే ఈ లుక్ పై సెటైర్లు వేస్తూ ‘నా పేరు సూర్య’ సినిమాలో ఆర్మీ లుక్ కోసం అల్లు అర్జున్ ఎంతో కష్టపడి తన లుక్ మార్చుకున్న విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ అలాంటి ప్రయత్నాలు మహేష్ ఎందుకు చేయడు అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. దీనితో ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ ఫస్ట్ లుక్ ఇంకా విడుదల కాకుండానే అప్పుడే ఈమూవీ పై నెగిటివ్ ప్రచారం మొదలైపోయింది అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: