ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మాతలకు పెద్ద హీరో డేట్స్ దొరకడం చాలా కష్టం. అలాంటిది ఓ నిర్మాణ సంస్థ ముగ్గురు స్టార్ హీరోలతో వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి తక్కువ టైమ్ లో ఇండస్ట్రీలో సెటిల్ కావడం సాధ్యమేనా? సాధ్యమేనని నిరూపించారు మైత్రీ మూవీ మేకర్స్.. రవి, నవీన్, మోహన్. యూఎస్ లో ఐటీ జాబ్స్ చేస్తూ సినిమాల మీద ప్యాషన్ తో టాలీవుడ్ కి వచ్చి పక్కా ప్లానింగ్ తో సక్సెస్ అయ్యారు.        

 

మహేశ్ తో శ్రీమంతుడు, ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, రామ్ చరణ్ తో రంగస్థలం.. ఇలా వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది మైత్రీ బ్యానర్. రంగస్థలం అయితే నాన్ బాహుబలి రికార్డ్స్ సాధించింది. దీంతో మైత్రీ బ్యానర్ సినిమాలంటే ప్రేక్షకులు ఓ అంచనాకు వచ్చేశారు. తరువాత వచ్చిన రవితేజ సినిమా అమర్ అక్బర్ ఆంటోనీ, నాగచైతన్య సవ్యచాచి ల్లో కంటెంట్ లేకపోవడంతో రెండూ డిజాస్టర్స్ గా మిగిలాయి. దీంతో ఒక్కసారిగా మైత్రీ బ్యానర్ డల్ అయింది. జాగ్రత్తగా ప్లాన్ చేసి చేసిన చిత్రలహరి పరవాలేదనిపించింది సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నిర్మిస్తున్న ఉప్పెన షూటింగ్ దశలో ఉంది. విజయ్ దేవరకొండ-రష్మిక కాంబినేషన్ లో నిర్మించిన డియర్ కామ్రేడ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలని అడ్వాన్స్ ఇచ్చినా ఆ సినిమాపై క్లారిటీ లేదు.

 

ఇంత సక్సెస్ రేట్ ఉన్న బ్యానర్ ఒక్కసారే స్లో అయింది. సినిమా జయాపజయాలు ఎవరి చేతుల్లో ఉండవు. కథల ఎంపిక నుండి రిలీజ్ వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏడెనిమిదేళ్ల క్రితం ఇండస్ట్రీలోని ఓ ఆర్టిస్ట్ ఇలానే జెట్ స్పీడ్ తో వచ్చి భారీ సినిమాలే తీసాడు. స్టార్ హీరోతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టాడు. తరువాత ప్లానింగ్ మిస్సవ్వడంతో ఆ బ్యానర్ నుంచి సినిమాలు ఆగిపోయాయి. ఇలాంటి ఉదంతాలు చూసైనా మైత్రీ వారు మంచి ప్లానింగ్ తో గాడిలో పడి మంచి సినిమాలు ఇవ్వాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: