రామ్ పూరి జగన్నాధ్ కంబినేషన్ లో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డబల్ సిమ్ కార్డు అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈమూవీ పై రామ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం వరస ఫ్లాప్ లపై కొనసాగుతున్న రామ్ కెరియర్ కు ఈ మూవీ విజయం అత్యంత కీలకంగా మారింది.   

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికేవిడుదలైన ట్రైలర్ లో పూరి తన పైత్యం మరోసారి చూపించాడంటూ విమర్శలు వస్తున్ననేపధ్యంలో ఈమూవీని కొనడానికి బయ్యర్లు భయపడి పోతున్నట్లు సమాచారం తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ ట్రైలర్ విడుదలకు ముందు ఈసినిమాకు సంబంధించి ఆంధ్ర రైట్స్ కు 10 కోట్లు డిమాండ్ చేసిన ఛార్మీ ఇప్పుడు ఏడు కోట్లకు తగ్గించినా ఎవరు కొనడానికి ముందుకు రావడంలేదు అని వార్తలు వస్తున్నాయి. 

దీనితో ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేయాల్సిందిగా దిల్ రాజు ను ఛార్మి రిక్వెస్ట్ చేసినా దానికి ఆయన ఒప్పుకోలేదని తెలుస్తోంది. దీనితో అయినంత వరకు అమ్ముకోవడమో లేక సొంతంగా విడుదల చేసుకోవడమో అన్న రెండు మార్గాల మధ్య ప్రస్తుతం పూరి ఛార్మి ఆలోచనలు ఉన్నాయి అని అంటున్నారు. వాస్తవానికి ఈసినిమాతో పోటీగా విదుదల అవుతుంది అని భావించిన బెల్లంకొండ శ్రీనివాస్ ‘రాక్షసుడు’ వాయిదా పడి ‘ఇస్మార్ట్ శంకర్’ కు సోలో రిలీజ్ డేట్ దొరికినా ఈ సినిమాకు పోటీగా 19న సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరిమట్ట’ సినిమా విడుదల అవుతూ ఉండటం ఆశ్చర్యంగా మారింది. 

దీనితో పూరిని నమ్ముకుని మరోసారి ఛార్మీ నష్టపోతోందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ సినిమాకు ఛార్మీ కీలక నిర్మాతగా మారి భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడంతో ఈమూవీ రిజల్ట్ గురించి పూరీ రామ్ ల కంటే ఛార్మీ విపరీతమైన టెన్షన్ లో ఉన్నట్లు టాక్..  



మరింత సమాచారం తెలుసుకోండి: