టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ ది ప్రత్యేకమైన అందం. అగ్రహీరోలందరితో నటించిన ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్ మన్మధుడు నాగార్జున సరసన మన్మధుడు2 సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా టీజర్ ఇదివరకే రిలీజ్ అయినా అందులో రకుల్ కనపడలేదు. లేటెస్ట్ గా రకుల్ ప్రీత్ సింగ్ మీద ప్రత్యేకంగా టీజర్ వదిలారు.

 

టీజర్ లో రకుల్ చాలా అందంగా, ఫ్రెష్ లుక్ లో ఉంది. అవంతిక గా నాగార్జున పక్కన సరిజోడిగా సరిపోయింది. 60కి దగ్గరలో ఉన్నా నాగార్జున ఎంతో ఫిట్ గా రాకుమారుడిలా ఉంటే రకుల్ క్వీన్ లా మెరిసిపోతోంది. చక్కటి గ్లామర్ తో ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెట్టేలా ఉంది. టీజర్ మొత్తం రకుల్ మీదే ఉంది. చీరకట్టులో, మోడరన్ డ్రస్సులో రకుల్ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే రిలీజైన టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ టీజర్ తో సినిమా లవర్స్ అందరూ ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అన్నట్టుగా ఉంది. “ఇప్పటి వరకూ యూ సర్టిఫికెట్ కోసం ప్రయత్నించాను.. ఇకపై ఏ సర్టిఫెకెట్ చూపిస్తాను..” అంటూ చాలా నాటీ కేరక్టర్ లో కనిపించింది. సిగరెట్ పొగ వదుల్తూ మరింత స్టైలిష్ గా కనిపించింది. చూస్తూంటే ఆ మన్మధుడు సినిమాను తలదన్నేలానే మన్మధుడు 2 టీజర్లు ఉన్నాయి. నాగ్-రకుల్ జోడీ సూపర్బ్ గా ఉండడంతో సినిమా ఫీల్ అదిరిపోయింది. 

 

హీరోయిన్లపై స్పెషల్ గా టీజర్ రిలీజ్ చేయడం రంగస్థలం నుంచి మొదలైంది. ఆ సినిమా రిలీజ్ కు ముందు సమంతపై ప్రత్యేకంగా వచ్చిన టీజర్ అప్పట్లో హాట్ న్యూస్ అయింది. సినిమాలో నిజంగానే సమంత క్యారెక్టర్ కు అంత ఇంపార్టెన్స్ ఉంది. మరిప్పుడు రకుల్ పై వదిలిన మన్మథుడు2 స్పెషల్ టీజర్ చూస్తుంటే రకుల్ క్యారెక్టర్ కి మంచి ఇంపార్టెన్స్ ఉన్నట్టే ఉంది. చూద్దాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: