ఒక్క టాలీవుడ్లోనే కాదు సౌత్లోనే... కాకుండా దేశవ్యాప్తంగా మోస్ట్ అవెటింగ్ ఫిలింగా ప్రశంసలు అందుకుంటోన్న రాజ‌మౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా పెద్ద సంచలనం అయిపోతుంది. బాహుబలి సిరీస్ సినిమాలతో దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చేశాడు. ఈ క్రమంలోనే ఆ సినిమా తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆర్ ఆర్ ఆర్ పై దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి.


టాలీవుడ్ కి చెందిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో హిస్టారికల్ కాన్సెఫ్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. రూ. 300 కోట్ల పైచిలుకు భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమాలో కొమరం భీంగా ఎన్టీఆర్ .... అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ తేజ్ నటిస్తున్నారు. ఈ సినిమా గురించి వ‌చ్చిన లెటెస్ట్ అప్‌డేట్ సినిమాపై మ‌రింత‌గా అంచ‌నాలు పెంచేసింది. ఈ సినిమా కోసం దాదాపు 30 కోట్లు ఖర్చు పెట్టి భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేశారట‌.


ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాజమౌళి ఇండియా తిరిగొచ్చిన వెంటనే టీం మొత్తం ఈ సీన్ షూటింగ్‌లో పాల్గొన‌నుంద‌ట‌. ఈ యాక్ష‌న్ సీన్ ఇంట‌ర్వెల్‌కు ముందు వ‌స్తుంద‌ని.. చెర్రీ, ఎన్టీఆర్ ఇద్ద‌రూ క‌లిసి న‌టించే ఈ సీన్ టోట‌ల్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంద‌ని అంటున్నారు. ఇక ప్ర‌స్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: