డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘ఇడియట్’సినిమాతో హీరోగా మాస్ ఆడియన్స్ మనసు దోచుకున్నాడు రవితేజ.  టాలీవుడ్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చిన రవితేజ అప్పటి వరకు చిన్న చిన్న క్యారెక్టర్స్ లో నటించాడు.  ఇడియట్ సినిమాతో మస్ మహరాజ పేరు తెచ్చుకున్న రవితేజ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమార్కుడు’సినిమాతో టాప్ హీరో లీస్టులోకి వెళ్లాడు. 

ఆ తర్వాత కిక్, దుబాయ్ శీను లాంటి సూపర్ హిట్ సినిమాలతో తనకు ఎదురు లేదనుకుంటున్న సమయంలో ఒక్కసారే ఫ్లాప్ లు ఎదురయ్యాయి.  దాంతో రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ సినిమాతో తన సత్తా ఏంటో చూపించాడు.  కానీ ఆ తర్వాత వచ్చిన మూడు సినిమాలు భారీ డిజాస్టర్స్ గా మిగిలాయి. దాంతో రవితేజ కెరీర్ మళ్లీ కష్టాల్లో పడింది. తాజాగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కోరాజా’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.

పాయ‌ల్ రాజ్‌పుత్‌, న‌భా న‌టేశ్ హీరోయిన్స్‌ కాగా మొన్నటి వరకు మరో హీరోయిన్ వేటలో ఉన్నారు. తాజాగా మూడో హీరోయిన్‌గా తాన్యా హోప్‌ను ఎంపిక చేసుకున్నార‌ట‌. తాన్యా నేను శైల‌జ‌తో, ప‌టేల్ సార్, అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు సినిమాల్లో న‌టించింది. ఎంత గ్లామర్ ప్రదర్శన చేసినా తెలుగు లో ఛాన్సులు మాత్రం దక్కించుకోలేక పోయింది. ఇప్పుడు డిస్కోరాజాలో పాత్ర‌తో అయినా తాన్యా హోప్ ల‌క్ మారుతుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: