టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం ఏ సినిమాలు చేస్తున్నాడనే డౌట్ అందర్లో ఉంది. కొత్త దర్శకులతో కొన్ని సినిమాలను కమిటయ్యి డ్రాపయ్యాడని ఈ డౌట్ వచ్చింది ప్రేక్షకులకు. అందుకే వీటిపై స్వయంగా నాగశౌర్య స్పందించాడు. "ప్రస్తుతం సొంత బ్యానర్ పై అశ్వద్ధామ సినిమా చేస్తున్నాను. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా కూడా జరుగుతోంది.  ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే 2 షెడ్యూల్స్ అయిపోయాయి. ఇక త్వరలోనే 'పార్థు' అనే టైటిల్ తో మరో సినిమా కూడా స్టార్ట్ అవుతుంది. సుబ్రమణ్యపురం డైరక్టర్ సంతోష్ ఈ సినిమాని డైరక్ట్ చేస్తాడు."

అంటూ తన అప్ కమింగ్ మూవీస్ పై నాగశౌర్య క్లారిటీ ఇచ్చాడు. ఓ బేబీ సక్సెస్ అయిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన శౌర్య, ఇలా తన కెరీర్ కు సంబంధించిన అనుమానాల్ని కూడా ఫటాపంచలు చేశాడు. రీసెంట్ గా తనకు జరిగిన యాక్సిడెంట్ పై స్పందించిన ఈ హీరో, సహజత్వం కోసమే రిస్క్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.
"రిస్క్ అవసరమే. హీరో రియల్ గా చేశాడా లేక డూప్ పెట్టారా అనే అంశాన్ని ప్రేక్షకులు చాలా క్లియర్‌గా గమనిస్తున్నారు. పైగా ఇది ఇంటర్వెల్ లో వచ్చే సీన్. దాదాపు 14 నిమిషాల ఎపిసోడ్. ఇలాంటి దగ్గర డూప్ పెడితే ఆడియన్స్ కు ఆ ఫీల్ రాదు. 

హీరో టెన్షన్ ఆడియన్స్ కు అర్థంకావాలి కదా. అందుకే సొంతంగా చేయడానికి ట్రై చేశాను. 6 నెలలు లేట్ అయినా ఫర్వాలేదు. అది నేనే చేస్తాను." అన్నాడు.
ఛలో సినిమాకు తనే కథ అందించానని చెప్పుకుంటున్న నాగశౌర్య, ప్రస్తుతం సెట్స్ పై ఉన్న అశ్వద్ధామకు కూడా కథ తనదే అంటున్నాడు. ఛలో సినిమాకు టైటిల్ వేసుకోలేదని, కొత్త సినిమాకు మాత్రం తన టైటిల్ పడుతుందని క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి శౌర్య తన సినిమాలకు కథ కూడా ఇవ్వడం విశేషం. 



మరింత సమాచారం తెలుసుకోండి: