‘సాహో’ మొదటిపాట ‘సైకో సయాన్’ తెలుగు పాటకు మన తెలుగు రాష్ట్రాలలోని ప్రభాస్ అభిమానుల మధ్య మిశ్రమ స్పందన రావడంతో ఈపాటకు ఇప్పటి వరకు కేవలం 3 మిలియన్ వ్యూస్ మాత్రమే వస్తే ఇదే మూవీకి సంబంధించిన హిందీ పాటకు ఏకంగా 15 మిలియన్ వ్యూస్ రావడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి తెలుగు రాష్ట్రాలలో ప్రభాస్ కు ఉన్నంత మ్యానియా బాలీవుడ్ ప్రేక్షకులలో ప్రభాస్ పట్ల లేదు అన్నది వాస్తవం.

అయితే ‘బాహుబలి’ తో నేషనల్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ తన రేంజ్ ని బాలీవుడ్ లో మరింత సుస్థిరం చేసుకోవడానికి ‘సాహో’ ను ఒక సాధనంగా వాడుకుంటున్నాడు. దీనితో ‘సాహో’ పాటల ట్యూన్స్ అన్నీ కూడ బాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ట్యూన్ చేయపడ్డాయి అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఈ నేపధ్యంలో ‘సాహో’ మొదటి పాటకు వచ్చిన స్పందనను పరిగణలోకి తీసుకుంటే నేషనల్ స్టార్ గా మరింత ఎదగాలని ప్రభాస్ చేస్తున్న ప్రయత్నాలు మరింత విజయవంతం అయ్యాయి అన్న అభిప్రాయం కలుగుతోంది. ‘సాహో’ లోని మొదటి పాటకు టాలీవుడ్ మీడియా నుండి పెద్దగా ప్రశంసలు రాకపోయినా బాలీవుడ్ మీడియా ఈ పాటను పొగుడ్తూ అప్పుడే కామెంట్స్ కూడ వ్రాస్తోంది. 

దీనితో ఈమూవీని జాతీయ స్థాయిలో భారీగా మార్కెట్ చేయాలి అన్న ప్రభాస్ ఆలోచనలకు తొలి విజయం లభించినట్లే అని అంటున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రభాస్ అభిమానులు తమకు ‘సాహో’ పూర్తిగా నచ్చకపోయినా జాతీయ స్థాయిలో ఆమూవీ ఘన విజయం సాధిస్తే తమకు ‘సాహో’ నచ్చినా నచ్చకపోయినా రాజీ పడవలసిందే అన్న కామెంట్స్ వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: