రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీయార్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా బడ్జెట్ అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తుంది. మొదట ఈ సినిమాను 250 నుండి 300 కోట్ల మధ్య తీయాలని భావించినా ఇప్పుడు ఆ బడ్జెట్ 400 కొట్ల రుపాయల దాకా అవసరమవుతుందని తెలుస్తుంది. క్వాలిటీ విషయంలో ఏ మాత్రం తగ్గని రాజమౌళి ఎంత భారీ బడ్జెట్తో సినిమా తీసినా ఆ సినిమా అంతకు మించిన కలెక్షన్లను సాధించడం మాత్రం ఖాయం. 
 
ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీయార్ ఇంట్రడక్షన్ సీన్ కోసమే దాదాపు 40 కోట్ల దాకా అవుతుందని తెలుస్తుంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్ల కోసం కూడా భారీగా ఖర్చు పెట్టబోతున్నారట. ఈ సినిమాలొ హీరోయిన్లుగా రామ్ చరణ్ సరసన అలియాభట్ ఫైనల్ కాగా ఎన్టీయార్ సరసన సాహో ఫేమ్ శ్రధ్ధా కపూర్ ను హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు వినికిడి. 
 
జులై 30 న విడుదల కాబోతున్న ఈ సినిమా బిజినెస్ భారీగా జరుగుతుంది.ఓవర్సీస్లో ఈ సినిమా హక్కులు 66 కోట్లకు అమ్మినట్లు తెలుస్తుంది. తెలుగు నుండే ఈ సినిమాకు 200 నుండి 250 కోట్ల బిజినెస్ జరగబోతుందని సినిమా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంకా విడుదల కాకముందే ఆర్ ఆర్ ఆర్ ఎన్నో విషయాల్లో సంచనాలు సృష్టిస్తుంటే సినిమా విడుదల తర్వాత ఇంకెన్ని సంచనాలు సృష్టిస్తుందో. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: