లక్ష్మీ రాయ్ నిరంతరం హాట్ బికినీ ఫొటోలతో సోషల్ మీడియాను వేడెక్కిస్తుంది. కుర్రకారు ఈ భామ అందాలను తట్టకుకోవటం కష్టమనే చెప్పాలి. క కత్తిలాంటి ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసి "మీరు మీ పర్సనాలిటీకి ఫోటో షాప్ చెయ్యలేరు" అంటూ కసక్కు క్యాప్షన్ ఇచ్చింది.  నిజమే.. మీ మొహానికి.. శరీరానికి ఎన్ని ఫిల్టర్లయినా తగిలించగలరు కానీ యాటిట్యూడ్ కు మాత్రం ఒరిజినల్.. ఎంత నటించినా ఏదో ఒకరోజు బయటపడక తప్పదు.


  ఇక ఫోటో సంగతి మాట్లాడుకుంటే ఈ ఫోటో తీసింది మాల్టాలో.  బాలీవుడ్ సింగర్.. దలేర్ మెహెంది సోదరుడు మికా సింగ్ కంపోజ్ చేసి పాడుతున్న పాట చిత్రీకరణలో పాల్గొందట.  ఈ పాట చిత్రీకరణలో రాయ్ లక్ష్మితో పాటుగా మరో బ్యూటీ షమ సికందర్ కూడా పాల్గొందట. ఆ షూటింగ్ లొకేషన్ నుంచి పైనున్న ఫోటోను తన అభిమాన నెటిజన్లకు వడ్డించింది. లేత అరిటాకు రంగు డ్రస్ లో అమిత సౌందర్యవతిలా.. అల్ట్రా స్టైలిష్ మోడల్ లా కూర్చుంది..  ఆ డ్రెస్ బికినీ కి కొంచెం పొడవాటి వెర్షన్ లాగా ఉంది.


కళ్ళకు గాగుల్స్ ధరించి సెన్సువల్ పోజిస్తూ వయ్యారంగా కూర్చుంది. నేపథ్యంలో దూరంగా నీలం సముద్రం ఈ ఫోటో అందాన్ని మరింతగా పెంచింది.  పేరుకు అరిటాకు రంగు డ్రస్సు వేసుకుంది .. కానీ ఆ సున్నితమైన అరిటాకు అందం మగ నెటిజనుల హృదయాన్ని ఎర్రగా కాల్చుకు తినేలా ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: