అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టుగా షాలిని పాండేకు అన్ని క్వాలిటీలు ఉన్నా సినిమా ఆఫర్లు మాత్రం రావడం లేదు.  తన మొదటి సినిమా అర్జున్ రెడ్డిలో రెచ్చిపోయింది.  రెచ్చిపోయి ముద్దులు పెట్టింది.  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదుల సంఖ్యలో హాట్ హాట్ గా ఉండే ముద్దులు ఇచ్చింది.  


ఈ ముద్దులతో సినిమాలు పరిగెత్తుకుంటూ వస్తాయని అనుకుంది.  విజయ్ కు ఆఫర్లు వచ్చాయి గాని షాలినికి మాత్రం దూరంగా ఉండిపోయాయి.  మహానటి సినిమాలో చిన్న రోల్ వచ్చింది.  అలానే 118 లో మరో హీరోయిన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది.  


ప్రసుత్తం తెలుగులో రాజ్ తరుణ్ తో రెండు సినిమాలు చేస్తోంది.  అలానే తమిళంలో మాత్రం ఈ అమ్మడుకి మంచి అవకాశాలు వస్తున్నాయి. టాప్ హీరోయిన్ గా ఎదగడానికి అన్ని రకాల అర్హతలు ఉన్నా ఎందుకని ఆఫర్లు రావడం లేదు. దీనికి కారణాలు ఉన్నాయని సమాచారం.  


వచ్చిన సినిమా ఆఫర్లలో తన రోల్ ఎంత ఉంది.. తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉన్నదా లేదా అని అడుగుతుండటంతో వచ్చిన ఆఫర్లు వెనక్కి పోతున్నాయని వినికిడి.  కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల నటనకు పెద్దగా స్కోప్ ఉండదు. అయినా పెద్ద సినిమాలు కాబట్టి చేస్తే బాగుంటుంది కదా.  ఇలా అన్ని ఆరాలు తీస్తే.. ఆఫర్లు ఎలా వస్తాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: