విజయనిర్మల మరణం తరువాత సూపర్ స్టార్ కృష్ణ చాల డిప్రషన్ కు లోనయ్యాడు అన్న వార్తలు వచ్చాయి. అయితే మహేష్ అనుకోకుండా తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు కృష్ణ డిప్రషన్ ను కొంత వరకు తగ్గించింది అంటూ సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఆనంద పడుతున్నారు. 

ఇక వివరాలలోకి వెళితే మహేష్ నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలోని ఆర్మీ ఆఫీసర్ పాత్రకు అజయ్ కృష్ణ అని పేరు పెట్టినట్లు దర్శకుడు అనీల్ రావిపూడి తన ట్విటర్ ద్వారా తెలియచేసాడు. ఇలా అనీల్ రావిపూడి మహేష్ పాత్రకు ఇలాంటి పేరు పెట్టడానికి ఒక సెంటిమెంట్ ప్రభావితం చేసింది. 

మహేష్ ఇప్పటి వరకు 25 సినిమాలలో నటించినా అతడిని నిజమైన సూపర్ స్టార్ గా మార్చిన సినిమాలు రెండు. ఒకటి ‘పోకిరి’ అయితే మరొకటి ‘దూకుడు’ పోకిరి సినిమాలో మహేష్ పాత్ర పేరు కృష్ణ మనోహర్ అయితే దూకుడు లో మహేష్ పాత్ర పేరు అజయ్. దీనితో ఈ రెండు సినిమాలలోని పాత్రల పేర్లను కలిపి అనీల్ రావిపూడి మహేష్ ను ‘సరిలేరు నీకెవ్వరు’ లో మేజర్ అజయ్ కృష్ణగా మార్చాడు. 

అయితే ఇప్పుడు ఈ సెంటిమెంట్ అనుకోకుండా సూపర్ స్టార్ కృష్ణ డిప్రెషన్ కు మందుగా మారింది అంటూ కృష్ణ అభిమానులు జోష్ లో ఉన్నారు. సంక్రాంతికి విడుదల కాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయం అన్న ప్రచారం జరుగుతోంది దీనితో సంక్రాంతికి రాబోతున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ నటించ కుండానే అతడి పేరు మారుమ్రోగి పోతుంది అని తెలుసుకున్న కృష్ణ ప్రస్తుతం విజనిర్మల మరణం నుండి తేరుకుని కొంత వరకు జోష్ లో ఉంటాడు అంటూ కృష్ణ అభిమానులు ఆనందపడుతున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: