సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇటీవల వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పివిపి, దిల్ రాజు, అశ్వినిదత్ సంయుక్తంగా నిర్మించిన మహర్షి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అయితే తన కెరీర్ పరంగా మహర్షితో వరుసగా రెండవ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం అదే ఊపుతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో నటిస్తున్నారు. కెరీర్ పరంగా మహేష్ బబాబు 26వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులల్లోను విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. 

అయితే ఈ సినిమాకు ప్రారంభం నాటినుండే ఇంత హైప్ రావడానికి కారణం ఒకరు సూపర్ స్టార్ మహేష్ అయితే మరొకరు హీరోయిజాన్ని పక్కాగా ఎలివేట్ చేస్తూ, మరోవైపు హీరోతో కిక్ ఇచ్చే కామెడీ పంచెస్ వేయించే దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకుడు కావడం. నిజానికి ఇటీవల మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను, మహర్షి సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నప్పటికీ, మహేష్ లోని పూర్తి స్థాయి కామెడీ కోణాన్ని మాత్రం చూడలేకపోయాము అనే చిన్న వెలితి మాత్రం మహేష్ ఫ్యాన్స్ లో ఉండిపోయింది. అయితే తాము తీస్తున్న ఈ సరిలేరు నీకెవ్వరు సినిమా, సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ వంటిందని, ఇక కామెడీకి అయితే సినిమాలో కొదవే లేదని, మరీ ముఖ్యంగా మహేష్ బాబు క్యారెక్టర్ మంచి వినోదాత్మకంగా సాగుతూ ఫ్యాన్స్ కి ఎంతో కిక్ ఇస్తుందని తెలుస్తోంది. 

ఇక భరత్ అనే నేను సినిమా, రెండు తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ లోనూ సూపర్బ్ గా కలెక్షన్లు సాధించగా, మహర్షి మాత్రం ఓవర్సీస్ లో కొంత నిరాశనే మిగిల్చిందని చెప్పవచ్చు. నిజానికి ఓవర్సీస్ లో ఎక్కువగా మాస్ మరియు ఎంటర్టైన్మెంట్ సినిమాలకే ఆదరణ ఉంటుంది, కాబట్టి ఈసారి ఎంటెర్టైన్మెంట్ తో పాటు అన్ని కమర్షియల్ అంశాలు కలగలిపి రాబోయే ఈ సరిలేరు నీకెవ్వరు సినిమా తప్పకుండా ఓవర్సీస్ లో అద్భుతమైన రికార్డ్స్ క్రియేట్ చేసి, మరొక్కసారి మహేష్ బాబు స్టామినా నిరూపిస్తుందని అంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. మరి అది ఎంతవరకు జరుగుతుందో తెలియాలంటే మాత్రం ఈ సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: