స్టార్ హీరో విక్రమ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా  'కదరం కొండన్',  తెలుగులో 'మిస్టర్ kk'గా  రాబోతుంది.  జూలై 19వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకం పై ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే  విక్రమ్ కి హిట్ వచ్చి చాలా కాలం అయిపోయింది. సినిమాలు వస్తున్నయి వెళ్తున్నాయి తప్ప.. విక్రమ్ కి మాత్రం నిరాశే మిగులుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో  'మిస్టర్ kk'గా  రాబోతుంది. కానీ ఈ సినిమా జనానికి మాత్రం కనీస స్థాయిలో కూడా  రీచ్ అవ్వలేదు. ఈ సినిమాకి సరైన ప్రమోషన్స్ కూడా  లేవు. 


అసలు ఈ స్టార్స్   సినిమాకి ఏమైంది..? ఇప్పటికైనా కమల్ - విక్రమ్ తమ సినిమా ప్రమోషన్స్  పై దృష్టి పెట్టాలని వారి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.  మరి అభిమానుల కామెంట్లుకైనా ఈ హీరోలు తమ సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తారేమో చూడాలి. కాగా కమలహాసన్‌ హీరోగా తూంగావనం చిత్రాన్ని తెరకెక్కించిన రాజేశ్‌ ఎం.సెల్వ దర్శకత్వంలో ఈ సినిమా తెరెకెక్కింది. ఈ సినిమాలో  విక్రమ్‌ తన శైలి యాక్టింగ్ తో   ఓ వైవిధ్యభరితమైన పాత్రలో  కనిపించనున్నాడు.  పైగా విక్రమ్ గెటప్‌ కూడా  కొత్తగా ఉంటుందట. కమలహాసన్‌ రెండో కూతురు అక్షరహాసన్‌ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: