స్వీటీ అనుష్క మరోసారి కింగ్ నాగార్జునతో జోడీ కడుతుందా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. భాగమతి తర్వాత సినిమాలకు మళ్లీ గ్యాప్ ఇచ్చిన అనుష్క ప్రస్తుతం సైలెంట్ గా సైలెన్స్ సినిమాతో పాటుగా సైరా సినిమాలో కూడా స్పెషల్ రోల్ లో నటిస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటుగా నాగ్ సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.


నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో బంగార్రాజు సినిమా వస్తుంది. ఈ సినిమాలో నాగార్జున సరసన అనుష్క నటిస్తుందని తెలుస్తుంది. సినిమాలో నాగ చైతన్య కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. చైతుకి జోడీగా కీర్తి సురేష్ ను ఎంపిక చేశారట. అన్నపూర్ణ బ్యానర్ లో నాగార్జున ఈ సినిమా నిర్మిస్తున్నారు.


సోగ్గాడే చిన్ని నాయనా సినిమా సూపర్ సక్సెస్ అవగా ఆ సినిమాకు సీక్వల్ గా బంగార్రాజు వస్తుంది. సినిమాలో అనుష్క హీరోయిన్ అయితే ప్లస్ అవుతుందని ఆమెను ఫైనల్ చేశారట. అయితే చిత్రయూనిట్ అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం నాగార్జున మన్మథుడు 2 సినిమా బిజీలో ఉన్నాడు.


రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో వస్తున్న మన్మథుడు 2 సినిమా ఆగష్టు 9న రిలీజ్ అవనుంది. ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించగా కీర్తి సురేష్, సమంత వంటి స్టార్స్ కూడా సినిమాలో స్పెషల్ రోల్స్ చేస్తున్నారు. చిలసౌతో సత్తా చాటిన రాహుల్ నాగ్ తో సూపర్ హిట్ సీక్వల్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: