సినిమా రంగంలోకి వచ్చిన కొత్తల్లో జగపతిబాబును గురించి చాలా విమర్శలు చేశారు.  నటన రాదనీ, వాయిస్ బాగుండదని ఎద్దేవా చేశారు.  కానీ, వాటిని ఆయన పట్టించుకోలేదు.  తనకు వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ వెళ్లారు.  హీరోగా చాలా సినిమాలు చేశారు.  


డ్యాన్స్ కూడా సరిగా చేయలేదని అన్నారు.  అయినా పట్టించుకోలేదు. సినిమాలో మంచి కథ ఉంటె చాలు అనుకున్నాడు.  ఫ్యామిలీ హీరోగా సెట్ అయ్యాడు.  ఈ ఫ్యామిలీ హీరో హవా కొంతకాలమే నడిచింది.  తరువాత పరిస్థితి ఏంటి అన్నది తెలియలేదు.  


చివరకు వచ్చే సరికి ఆయనకు సినిమాలు రావడం మానేశాయి.  చివరకు బోయపాటి లెజెండ్ సినిమాలో విలన్ గా వేషం దొరికింది.  అయితేనేం పవర్ఫుల్ రోల్ ఒకే చెప్పాడు.  అక్కడి నుంచే ఆయన దశ మారింది.  దిశ తిరిగింది.  వరసగా సినిమాలు వచ్చాయి.  


జగపతిబాబు గొంతుకు ప్రాధాన్యత వచ్చింది.  వాయిస్ లో మాడ్యులేషన్ పెరగడంతో పాటు బేస్ కూడా పెరిగింది.  విలన్ పాత్రలకు సరిగ్గా సూటయ్యే వాయిస్.  అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు.  ఇప్పటి వరకు ఆయన ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించాడు.  అరవింద సమేత లో చేసిన విలన్ రోల్ ఎప్పటికి మర్చిపోలేరు.  


మరింత సమాచారం తెలుసుకోండి: