సాధారణంగా బన్నీ ఏ ఫంక్షన్ కు వెళ్లిన ఏదైనా కార్యక్రమానికి వచ్చిన అతని టీం చేసే అతి అంతా ఇంతా కాదు. చిన్న దానికి పెద్ద దానికి నానా హడావుడి చేస్తుంటుంది. బన్నీ ఏదైనా సినిమా చూసి దాని టీంను అభినందించినా.. ఏదైనా వేడుకకు హాజరైనా.. బయట ఏదైనా వాణిజ్య కార్యక్రమంలో పాల్గొన్నా దాన్ని ఓ రేంజిలో సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తుంటారు. ఈ మధ్య ‘బ్రోచేవారెవరురా’; ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి చిన్న సినిమాల్ని చూసి వాటి బృందాల్ని అభినందిస్తే అది పెద్ద వార్త అయింది.


‘ఓ బేబీ’ చూసి సమంతకు ఫోన్ చేసి అభినందిస్తే దాని గురించి కూడా ఊదరగొట్టేశారు. ఇక బన్నీ అభిమాన సంఘాల పేరుతో నడిచే సోషల్ మీడియా అకౌంట్లను ఎంత పక్కాగా మెయింటైన్ చేస్తారో గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.దసరా టైంలో బన్నీ పల్లెటూరికి వెళ్లినా అభిమానుల్ని మొబిలైజ్ చేసి పీఆర్ టీం చేసే హడావుడి మామూలుగా ఉండదు. ఇతాజాగా బన్నీ వ్యానిటీ వ్యాన్ ‘ఫాల్కన్’ గురించి సామాజిక మాధ్యమాల్లో ఎంత హడావుడి నడుస్తోందో తెలిసిందే. 


దీని గురించి బన్నీ ట్వీట్ చేస్తూ ఫొటోలు షేర్ చేయడమే విచిత్రం. సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలని అభిమానులకు ఉంటుంది కానీ.. వాళ్లకు వాళ్లుగా ఈ విశేషాలు పంచుకుంటే బడాయి పోతున్నట్లు ఉంటుంది.ఇంత లగ్జరీ ఏంటి అని మామూలు జనాలు నెగెటివ్‌గా చూస్తారు. మొన్న బన్నీ ఫొటోలు పంచుకోవడమే ఎక్కువ అనుకుంటే.. తాజాగా ఒక టీవీ ఛానెల్‌ ఈ వ్యానిటీ వ్యాన్ మీద పది నిమిషాల ప్రోగ్రాం చేసేసింది. వ్యానిటీ వ్యాన్ లోపలికి వెళ్లి అందులో అణువణువునూ పరిచయం చేస్తూ అతిశయాలు పోతూ స్టోరీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: