తెలుగు ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది అక్కినేని సమంత. ఈ అమ్మడు నటిస్తున్న ప్రతి చిత్రం సూపర్ హిట్ కావడం..మంచి కలెక్షన్లు రాబట్టడం జరుగుతుంది. ఏం మాయ చేసావే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ బ్యూటీ ఆ చిత్రంలోని హీరో అక్కినేని నాగ చైతన్యతో రియల్ లైఫ్ లో లవ్ లో పడింది. పెద్దలను ఒప్పించి పెళ్లికూడా చేసుకున్నాడు.
పెళ్లైన తర్వాత సమంత నటిస్తున్న ప్రతి చిత్రం సూపర్ హిట్ అవుతుంది. అయితే సమంతకు సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎక్కువే. ఈ నేపథ్యంలో అక్కినేని సమంత చిన్నప్పటి ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేసి ఆమెని సర్ప్రైజ్ చేశాడు ఓ నెటిజన్. సమంతకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమెకు తన పాత రోజుల్ని గుర్తు చేస్తున్నారు. వారందరికీ సమంత పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నారు.
తాజాగా సమంత అభిమాని ఒకరు ఆమె చిన్నప్పటి ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేస్తూ 'పిక్చర్ ఆఫ్ ది డే' అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటో చూసి సమంత ఆనందానికి అవధులు లేవు..తన చిన్నప్పటి ఫోటో చూసి తెగ సంబరపడి పోయింది. అంతే కాదు 'ఈ ఫోటో మీకెలా దొరికింది' అంటూ ఎంతో ఎగ్జైట్ అయింది.
మరో అభిమాని.. సమంత, చైతు, అఖిల్ ఉన్న ఫోటో షేర్ చేశారు. ఆ ట్వీట్ పై స్పందించిన సామ్ 'ఆ రోజు ఏం మాట్లాడుకున్నామో.. నాకు ఇప్పటికీ గుర్తుంది' అని బదులిచ్చింది.