దొరసాని, టైటిల్ బాగుంది. టీజర్ బాగుంది. హీరో హీరోయిన్ల ఫ్రెష్ లుక్ బాగుంది. టోటల్ గా అన్నీ మంచిగానే ఉన్నాయి. ఇక ఈ రోజు విడుదల అయిన ఈ మూవీ బాగుందన్న టాక్ ఇపుడు వినిపిస్తోంది. ప్యూర్ లవ్ స్టోరీ కావడంతో ఈ మూవీ మీద మంచి అంచనాలు ఎక్కువగా  ఉన్నాయి. దానికి తగినట్లుగానే మూవీ కూడా ఉందని అంటున్నారు. 


విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా దొరసాని సినిమా చేస్తున్నాడు. ఇందులో శివాత్మిక హీరోయిన్.  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  విజయ్ తమ్ముడు కావడం.. అటు రాజశేఖర్ కూతురు హీరోయిన్ కావడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది.  


ఇక ట్రైలర్ బాగుందనే టాక్ రావడంతో సినిమాకు హైప్ తో పాటు పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది.  పైగా టాలీవుడ్ లో ఫస్ట్ సినిమాతో హిట్ అందుకున్న దర్శక నిర్మాతలు సినిమా గురించి పొగుడుతూ ట్వీట్ చేయడం విశేషమైతే.. ఈ మూవీకి సూపర్ ప్రొడక్షన్స్ బ్యానర్ అండ ఉండటం మరో ప్లస్ అయ్యింది.  వెరసి సినిమా బాగుందని అంటున్నారు.


సినిమా చాలా బాగుందని, సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికి కథలో లీనం అయ్యేలా కథను నడిపించారని డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి  ట్వీట్ చేశారు.  ప్రశాంత్ వర్మ, వేణు ఉడుగుల, ప్రశాంత్ తిన్ననూరి, అజయ్ భూపతి, సందీప్ రెడ్డి వంగ లు ఈ సినిమా చూసి ట్వీట్ చేశారు.  ఇంతమంది బాగుంది అంటున్నారు అంటే ఇందులో విషయం ఉండే ఉంటుంది.  మొత్తానికి మంచి ప్రేమ కధతో తీసిన దొరసాని ఫీల్ గూడ్ మూవీగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: