సంక్రాంతి అంటేనే టాలీవుడ్ కు  పండగ.  సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలన్నీ హిట్ అవుతాయనే  నమ్మకం. ఈసారి సంక్రాంతి బరి లో నిలిచే పందెం కోళ్లు ఎవరో తేలిపోయింది . సంక్రాంతికి ప్రిన్స్ మహేష్ బాబు,  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  సినిమాలు పోటీ పడుతున్నాయి.  ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా గా చెప్పేశారు మేకర్స్ .


  ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా  అనిల్ రావిపూడి రూపొందిస్తున్న సరిలేరు నీకెవ్వరు  అనే సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా దర్శకుడు వెల్లడించాడు.   ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టయిలిష్  స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉండనుందని నిర్మాణ సంస్థ హాసిని - హారిక  క్రియేషన్స్ తెలియజేసింది. ఈ  ఇద్దరు అగ్ర హీరోలు  నటించనున్న రెండు సినిమాలు లు ఒకదాని వెంట మరొకటి సంక్రాతి పండుగకు  థియేటర్లలో సందడి చేయనున్నాయి .


సంక్రాంతి కే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మరొక సినిమా కూడా  ప్రేక్షకుల ముందుకు రానుంది .  ఇక బాలయ్య కేఎస్  రవికుమార్ కాంబో లో రూపొందుతున్న సినిమా మాత్రం  ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు . త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని   సెంటిమెంట్ గా బాలయ్య సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తామని నిర్మాత సి.కళ్యాణ్ చెప్తున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: