భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్న రామాయణం సినిమాలో ఎన్టీఆర్ ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ప్రకటించబడిన రామాయణ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. 1500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇద్దరు డైరెక్టర్లు స్క్రిప్ట్‌కి మెరుగులు దిద్దుతున్నారు. మొత్తం మూడు పార్టులుగా రూపొందించ బోతున్న రామాయణ సిరీస్ మొదటి భాగాన్ని 2021 లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 


రామాయణ అంటే ముందుగా గుర్తొచ్చేది రాముడు, రావణుడే. దీంతో ఈ రెండు పాత్రలు ఎవరు చేస్తారా? అనే అప్‌డేట్ కోసమై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఇప్పటికే రాముడిగా రామ్ చరణ్‌ని సంప్రదించగా, ఆయన ఓకే చెప్పలేదని తెలిసింది. ఈ లోగా ఇప్పుడు రావణుడి పాత్ర కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరును పరిశీలనలో పెట్టారని తెలుస్తోంది. రౌద్రపూర్తిమైన రావణుడి పాత్రను ఎన్టీఆర్‌తో చేయించాలని యూనిట్ భావిస్తున్నట్లు తాజా సమాచారం.


అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ రావణుడిగా అదరగొట్టాడు.. అలాగే ఇటీవల వచ్చిన జై లవకుశ సినిమాలో రావణుడిగా జూనియర్ ఎన్టీఆర్ చించేశారు. ఈ నేపథ్యంలో రావణుడి పాత్ర ఎన్టీఆర్‌కి మాత్రమే సూట్ అవుతుందని భావిస్తున్నారట మేకర్స్. నిజానికి ఇలాంటి భారీ ప్రాజెక్టులో ఎన్టీఆర్ భాగమైతే ఇక జరిగే సంచలనాలు ఊహించగలమా? చెప్పండి. కానీ ఎన్టీఆర్ ప్రస్తుతం బిజీ బిజీ షెడ్యూల్స్‌లో ఉన్నారు. ఓ వైపు RRR షూటింగ్ జరుగుతుండగానే.. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్టు కన్ఫర్మ్ చేసుకున్నారు ఎన్టీఆర్. చూడాలి మరి ఒకవేళ యూనిట్ సంప్రదిస్తే 'రామాయణ' విషయంలో ఎన్టీఆర్ నిర్ణయం ఎలా ఉంటుందనేది. 

మరింత సమాచారం తెలుసుకోండి: