ఎప్పటినుంచో డైలమాలో ఉన్న సినిమాల విషయంలో మొత్తానికి ఒక క్లారిటీ వచ్చేసింది. 2020 సంక్రాంతికి స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబుల మధ్య పోటీ ఫిక్స్ అయిపోయింది. ఇటు మహేష్ సినిమా, అటు బన్నీ సినిమా సంక్రాంతికే అని రెండు సినిమాల యూనిట్ ల నుంచి క్లారిటీ వచ్చేసింది. మహేష్ సినిమా రిలీజ్ సంక్రాంతికే అని దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్టర్ లో రీసెంట్‌గా అప్‌డేట్ ఇచ్చాడు. ఇది జరిగిన కొద్ది సేపటికే హారిక హాసిని యూనిట్ నుంచి కూడా క్లారిటీ వచ్చేసింది. సంక్రాంతికే మా సినిమా విడుదల అంటూ అఫీషియల్‌గా అప్‌డేట్ ఇచ్చారు. 

అయితే ఇందులో ఆసక్తికరమైన విషయమేమిటంటే రెండు యూనిట్ ల నుంచి డేట్ మాత్రం రివీల్ చేయలేదు. జనవరి 10, 11, 12 తేదీలలో ఈ సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. అయితే ఈసారి బన్నీ సినిమా వెనకే వస్తుందని తెలుస్తోంది. అందుకే డేట్ ఇవ్వలేదు. మహేష్ సినిమా 10 అంటే ఇది 11కి, అది 11 అంటే ఇది 12కు పక్కా అన్నమాట. మొత్తానికి ఈ రెండింటికి మాత్రం పోటీ డిసైడయిపోయింది. ఈ సినిమాల వెనుకే సూపర్ స్టార్ రజనీ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. 
 
ఇక క్లారిటీ రావాల్సింది బాలకృష్ణ-కేఎస్ రవికుమార్ సినిమా నుంచే. ఈ సినిమా ఇంకా ప్రారంభమే కాలేదు. సంక్రాంతికే అని నిర్మాత సి కళ్యాణ్ అంటున్నారు. కానీ సినిమా స్టార్ట్ కావాలి. ఫినిష్ కావాలి. అప్పటి సంగతి. అదే జరిగితే సంక్రాంతి రేస్ లో ఫోర్త్ కాంపిటీటర్ గా బాలయ్య కూడా రంగంలోకి దిగిపోతారు. మరి ఈ 2020 లో నెగ్గేదెవరో తెలియాలంటే మనం కూడా 2020 లోకి అడుగుపెట్టాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: