కాస్త లాంగ్ గ్యాప్ తరువాత యంగ్ హీరో నితిన్ చేస్తున్న సినిమా భీష్మ. ఈ సినిమాలో నితిన్ లుక్ ఒకటి రీసెంట్‌గా లీక్ అయింది. ఈ లుక్ లో నితిన్ చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నాడు. మాంచి ఫిట్ నెస్ తో కనిపిస్తూ, స్లిమ్ అయినట్లు అనిపిస్తున్నాడు. అయితే ఈ మధ్య నితిన్ కి సరైన హిట్ లు పడడంలేదు, అది బ్యాడ్ లక్ అనో, బ్యాడ్ స్క్రిప్ట్ లో? లోపమా మాత్రం అంటే ఖచ్చితంగా ఈ రెండు కారణం అని చెప్పొచ్చు.

కానీ ఇప్పుడు చేస్తూన్న సినిమాలలో లుక్ దగ్గర నుంచి అన్ని విషయాల్లోను బాగా కేర్ తీసుకుంటున్నాడు నితిన్. అందుకు సాక్ష్యమే ఈ పిక్ అనుకోవచ్చు. భీష్మ, రంగ్ దే, అలాగే చంద్రశేఖర్ యేలేటి సినిమాలను ఒకేసారి అనౌన్స్ చేసి, ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు నితిన్. డిసెంబర్ 6న భీష్మ సినిమాను విడుదల చేయాలన్న టార్గెట్ తో  ఈ సినిమాను శరవేగంగా కంప్లీట్ చేస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత రంగ్ దే సినిమాను కూడా రెడీ చేయడానికి వీలుగా స్క్రిప్ట్ ఫైనల్ చేసి, కాస్టింగ్..టెక్నీషియన్స్.. వగైరా పనులు స్టార్ట్ చేసేసారు దర్శకుడు వెంకీ అట్లూరి. మొత్తం మీద నితిన్ కెరీర్ మళ్లీ గాడిలో పడినట్లే కనిపిస్తోంది. ఈ సినిమాల తరువాత కృష్ణచైతన్య ప్రాజెక్టు ఒకటి పెండింగ్ లో వుంది. అదికాస్త భారీ ప్రాజెక్టు. అందువల్ల అది కాస్త వెనుకగా టేకప్ చేసే అవకాశం వుందని టాలీవుడ్ మీడియా నుండి అందిన లేటెస్ట్ న్యూస్. 



మరింత సమాచారం తెలుసుకోండి: