అక్కినేని నాగార్జున అంటే టాలీవుడ్ లో ఎంతో గౌరవం మర్యాద ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తనయులు ఇద్దరు హీరోలుగా రాణిస్తున్నారు. అదే సమయంలో నాగార్జున కూడా హీరోగా తన సత్తా చాటుతున్నారు. నాగ్ కెరీర్ లో టాప్ మూవీ అయిన మన్మథుడు  సీక్వెల్ మన్మథుడు 2 చిత్రం రూపొందుతుంది.  ఈ చిత్రానికి రాహూల్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. 

ఇటీవల విడుదలైన టీజర్స్ లో నాగార్జున 60 ఏళ్ల వయసులో కూడా చాలా యంగ్ గా కనిపిస్తున్నారు.  ఆగష్టులో మన్మథుడు 2 రిలీజ్ కు సిద్ధం అవుతోంది. అంతా బాగుంది కానీ ఈ టీజర్ పై రక రకాల విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.  ఇందులో ఇద్దరు హీరోయిన్లతో లిప్ లాక్ సీన్ల పై నెటిజన్లు కాస్త ఘాటుగానే స్పందించారు.  ఈ వయసులు ఇదేం రొమాన్స్ అందులోనూ తన కొడుకుతో హీరోయిన్ గా నటించినవారితో అంటూ విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే..రెండవ టీజర్ లో రకుల్ పాత్రని బోల్డ్ గా ప్రజెంట్ చేశారు.

సిగరెట్ తాగుతూ.. 'ఎ' సర్టిఫికెట్ చూపిస్తా అనే రకుల్ డైలాగ్స్ పై విమర్శలు వినబడుతున్నాయి. దాంతో ఇలాంటి సీన్లపై నాగార్జున అసహనం వ్యక్తం చేసినట్లు టాక్ వినిపిస్తుంది.  తనకు ఉన్న ఇమేజ్ కి ఫ్యామిలీ ఆడియన్స్ దూరం కాకూడదని, రొమాన్స్  సన్నివేశాలు తగ్గించాలని దర్శకుడిని కోరినట్లు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: