తెలుగు యాంకర్ ఓంకార్ దర్శకుడిగా మారిన తర్వాత హర్రర్ కాన్సెప్ట్ తో ‘రాజుగారి గది’తెరకెక్కించారు.  ఈ మూవీలో హర్రర్,కామెడీ తో పాటు మెసేజ్ కూడా ఉండటంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు.  ఈ సినిమా సూపర్ హిట్ కాగానే సీక్వెల్ గా రాజుగారి గది 2 సినిమా తీశాడు.  ఈ మూవీలో నాగార్జున, సమంత నటించినా పెద్దగా హిట్ కాలేదు.  హిట్, ఫ్లాప్ తో ప్రమేయం లేకుండా రాజుగారి గది 3 కి ప్లాన్ చేస్తున్నారు ఓంకార్. 

అయితే ఈ మూవీలో మొదట తమన్నాను అనుకున్నారు..అంతే కాదు పూజా కార్యక్రమాలు కూడా జరుపుకున్నారు.  కానీ కొన్ని కారణాల వల్ల తమన్న ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.  ఆ తర్వాత కాజల్ అనుకున్నారు..ఆమె కూడా ఒప్పుకోలేదని సమాచారం.  దాంతో బాలీవుడ్ బ్యూటీ అవికా గోర్ అనుకున్నారు.  కాగా.. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఇప్పుడీ సినిమాలో మ‌రో కీల‌క పాత్ర కోసం అందాల యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్‌ను తీసుకున్నార‌ట‌.

ఇది వ‌ర‌కే కొన్ని హార‌ర్ చిత్రాల్లో న‌టించిన ర‌ష్మి గౌత‌మ్ మరోసారి హార‌ర్ కామెడీ `రాజుగారిగ‌ది 3` లో న‌టిస్తుందో లేదో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. అయితే ఈ మూవీ ఎవరు హీరోయిన్ గా ఫిక్స్ అవుతారో అన్న విషయంపై రోజుకో వార్త వస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేయలేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: