2002లో వచ్చిన మన్మథుడు సినిమాలో అక్కినేని నాగార్జున నటించారు. ఆ సినిమాతో తర్వాత నాగార్జునను మన్మథుడులా ఊహించుకుంటారు. ఆ చిత్రం నాగ్‌కి రొమాంటిక్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. మరో సారి నాగార్జున మన్మథుడుకు సీక్వల్గా మన్మథుడు 2 సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ప్రోమోస్ ఆసక్తికరంగా ఉండడంతో ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది.
ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రలర్ చూసిన ప్రేక్షకులు ఈ వయస్సులో కూడా నాగార్జున మన్మథుడు 2లో తన రొమాంటిక్ ఇమేజ్‌తో అలరించబోతున్నాడని ఫిక్సయ్యారు. ఈ సినిమా ట్రైలర్లు, పోస్టర్లు చూస్తుంటే నాగ్ వయసుమళ్ళిన బ్రహ్మచారి పాత్రలో నటిస్తున్న తెలుస్తోంది. అలాగే వయస్సు లేట్ అవ్వడంతో పెళ్లి, ప్రేమ వ్యవహారాలతో ఇబ్బంది పడుతాడని తెలుస్తుంది. ఈ విషయంలోనే నాగ్‌ను అమ్మ... అక్క చెల్లెళ్లు టీజ్ చేయడం భలే సరదగా ఉంటుందని టీజర్ చెప్పేస్తోంది.
ఇదే టైమ్‌లో మనకు ఫన్ అయితే.. మన్మథుడు ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉంటాడని తెలుస్తోంది. ఈ ఫ్రస్ట్రేషన్ నుండి మరి నాగ్ ఎలా భయట పడతాడో తెలుసుకోవాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. ఆగస్టు 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై నాగ్ చాలా కాన్ఫిడెంట్‌తో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకుంటే ఆగస్టు 15న ప్రభాస్ `సాహో` రిలీజ్‌కు ముందు వారం రోజులే ఉన్నా `మన్మథుడు 2` ను థియేటర్లలోకి వస్తుందంటే నాగార్జున ఈ సినిమాపై ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో తెలుస్తోంది.