కెరీర్ మొదట్లో సినిమా సినిమాకు గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్ రచ్చ సినిమా నుండి సంవత్సరానికి ఒక సినిమా విడుదల చేస్తున్నాడు. మిగతా హీరోలతో పోలిస్తే రామ్ చరణ్ నటించిన సినిమాల సంఖ్య తక్కువే అయినప్పటికీ చరణ్ నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం హిట్లే ఉన్నాయి. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ సక్సెస్ అవుతున్నాడు రామ్ చరణ్. 
 
ఇలాంటి రామ్ చరణ్ ఒక డేరింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ ఇకమీదట సంవత్సరంలోపు షుటింగ్ పూర్తయ్యే సినిమాలకే ఓకె చెప్పాలని నిర్ణయించుకున్నాడట. ఒక్కో సినిమాకు సంవత్సరం నుండి రెండు సంవత్సరాల సమయం తీసుకోవటం వలన సమయం వృధా అవుతుందని రామ్ చరణ్ భావిస్తున్నాడట. కథ మరీ అద్భుతంగా ఉంటే మాత్రమే సంవత్సరం కంటే ఎక్కువ రోజులు కేటాయించాలని అనుకుంటున్నాడట. 
 
నిజానికి రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయం మంచిదే. చరణ్ లాంటి హీరోలు ఒక్కో సినిమాకు ఎక్కువ సమయం తీసుకొంటే ఆ ప్రభావం టాలీవుడ్ ఇండస్ట్రీపైనే పడుతుంది. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. 2020 జులై 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. మగధీర, రంగస్థలం సినిమాల తరువాత మరో ఇండస్ట్రీ హిట్ చరణ్ ఖాతాలోకి రాబోతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: