బాలీవుడ్ మార్కెట్ ను కూడ షేక్ చేయాలని చిరంజీవి సినిమా ‘సైరా’ భావిస్తోంది. దీనితో ఈమూవీ గురించి అనేక ఆలోచనలు చేసి అక్టోబర్ 2 గాంధీజయంతి అవకాశంగా తీసుకుని ‘సైరా’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈమూవీ రిలీజ్ డేట్ గురించి ముందుగానే లీకులు ఇస్తున్నా ఆ లీకులు పట్టించు కోకుండా బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ తన లేటెస్ట్ మూవీ ‘వార్’ ను అక్టోబర్ 2న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించడం షాకింగ్ న్యూస్ గా మారింది. 

ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ లోని యాక్షన్ సన్నివేశాలలో హృతిక్ రోషన్ బాగా నటించాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ యూత్ కు బాగా క్రేజీ హీరోగా మారిన టైగర్ ష్రాఫ్ కలిసి మల్టీ స్టారర్ గా ఈమూవీ చేస్తున్నాడు. దీనితో బాలీవుడ్ మార్కెట్ లో చిరంజీవి ‘సైరా’ కు హృతిక్ వార్ గట్టిపోటీ ఇచ్చే ఆస్కారం ఉంది. 

ప్రస్తుత తరం యూత్ కు బాగా నచ్చే బైక్ కార్ చేజింగ్ లు హెలికాఫ్టర్ సాహసాలు విదేశీ లోకేషన్స్ తో అత్యంత భారీగా నిర్మింప బడ్డ ‘వార్’ ముందు చారిత్రాత్మిక సినిమా ‘సైరా’ నిలబడగలదా అన్న సందేహాలు బాలీవుడ్ మీడియా వ్యక్త పరుస్తోంది. వాస్తువానికి బాలీవుడ్ మార్కట్ లో హృతిక్ క్రేజ్ తో పోల్చుకుంటే చిరంజీవి క్రేజ్ చాల తక్కువ.

దీనితో ‘సైరా’ కు బాలీవుడ్ లో ఊహించని స్థాయిలో స్పందన వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీనికితోడు మన తెలుగులో కూడ ‘సైరా’ ను టార్గెట్ చేస్తూ వెంకటేష్ నాగచైతన్యల ‘వెంకీ మామ’ దసరా రేస్ కు రాబోతోంది. ఈ పరిస్థుతులలో తెలుగు హిందీలలో ‘సైరా’ ను కార్నర్ చేస్తూ ముప్పేటి దాడి జరుగుతోంది అనుకోవాలి..     


మరింత సమాచారం తెలుసుకోండి: