ఇటీవలే అజయ్ దేవ్ గన్ నటించిన దేదే ప్యార్ దే చిత్రం విడుదలై మంచి విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే, దీంట్లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ను ఒక ఆంగ్ల మీడియా విలేకరి మీటూ క్యాంపైన్  ని ఉద్దేశిస్తూ ఒక ప్రశ్న వేశారు. ఇందులో అలోక్ నాథ్ కీలక పాత్రను పోషించారు. ఆయన తీవ్ర లైంగిక ఆరోపణలను ఎదుర్కొంటున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ కేసు నడుస్తున్నప్పటికీ అలోక్ ను ఎందుకు సినిమా లోకి తీసుకున్నారని అజయ్ పై చాలా మంది తీవ్రంగా మండిపడ్డారు.

దీని గురించి అజయ్ దేవగన్ స్పందిస్తూ ఏమన్నారంటే అలోక్ ఆరోపణలు ఎదురుకోవడం వేరు మరియు దోషులుగా నిరూపితం అవ్వడం వేరు. దోషిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి తోటి నిజంగా సినిమాలలో తీసుకోవడం తప్పే, కానీ అతను కేవలం ఆరోపణులు మాత్రమే ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు అవకాశాలు ఇవ్వకపోతే మనం తప్పు చేసినవాళ్లం అవుతాము. అతను దోషిగా నిరూపితమయినప్పుడు కనీసం అతని ముఖం కూడా చూడను.

అలోక్ లాగే నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఇట్లాంటి తీవ్ర ఆరోపణలకు గురయ్యాడు. అతని ఫ్యామిలీ తీవ్ర డిప్రషన్ ను ఎదురుకుంటుంది. వాళ్ళ పాప అయితే కనీసం స్కూల్ కి కూడా వెళ్లడం లేదు తినడం కూడా మానేసింది. వారి కుటుంబం చాలా బాధపడుతుంది. వాళ్ళు తీవ్ర డిప్రెషన్ కి గురయ్యారు. ఇలాంటివి దృష్టిలో పెట్టుకుని తనకి అవకాశం ఇవ్వడం జరిగినది. అతడు కేసులో నిర్దోషి అని తేలితే మనం సరిదిద్దుకోలేని తప్పులు చేసిన వాళ్ళము అవుతాం. అందుకే అలోక్ ను ఆ సినిమాలోని పాత్రకి తీసుకుంన్నామని అజయ్ తన భావాన్ని వ్యక్తపరిచారు.

ప్రస్తుతం అజయ్ రాజమౌళి నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో ఒక కీలక పాత్రను పోషిస్తూ ఆయన బిజీగా ఉన్నారని ఆయన తెలియజేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: