ఎనర్జిటిక్ రామ్ - పూరి జగన్నాథ్ కాంబినేషన్ మూవీ `ఇస్మార్ట్ శంకర్` ట్రైలర్ వచ్చింది మొదలు ఈ సినిమాపై రకరకాల వివాదాలు వేడెక్కించిన సంగతి తెలిసిందే. గురువారం ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. రిలీజ్ కి ముందే 38.50 కోట్ల టేబుల్ ప్రాఫిట్ దక్కిందని ప్రచారమైంది. 


అయితే ఇందులో వాస్త‌వం వేరేగా ఉంద‌ని అస‌లు లెక్క‌లు చూశాక అర్థ‌మైంది. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఈ సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ రూ.17 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి. దీనికి అదనంగా శాటిలైట్-ఆడియో- డిజిటల్ రైట్స్ కలిసి రానున్నాయని తెలుస్తోంది. ఇదీ ఇస్మార్ట్ బిజినెస్ అసలు లెక్క. 


దాదాపు రూ. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి రూ. 17 కోట్ల మేర టేబుల్ పైకి వచ్చింది. రూ.17- 20 కోట్ల మేర థియేట్రికల్ షేర్ వసూలు చేస్తే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అయినట్టేనని భావిస్తున్నారు.
ఏరియాల వారీగా ఈ సినిమా బిజినెస్ ఇలా ఉంది.


నైజాం - 6.50 (రూ.కోట్ల‌లో)


సీడెడ్ - 2.52


వైజాగ్ - 1.40


ఈస్ట్ - 1.05


వెస్ట్ - 0.90


కృష్ణా - 0.95


గుంటూరు - 1.10


నెల్లూరు - 0.48
=======================
ఏపీ + తెలంగాణ = 14.90 కోట్లు
========================


రెస్టాఫ్ ఇండియా - 1.20


రెస్టాఫ్ వ‌ర‌ల్డ్ - 0.90
=============================
వ‌ర‌ల్డ్‌వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ = 17 కోట్లు
==============================


మరింత సమాచారం తెలుసుకోండి: