మహేష్ బాబు కూతురు సితార యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది. ఏంటి కామెడీ అనుకుంటున్నారా ? కాదు నిజంగానే సితార పాపా తన స్నేహితురాలు ఆద్యతో కలిసి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది. ఆ యూట్యూబ్ ఛానల్ కి 'అధ్య VS సితార' అని పేరుని పెట్టి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు. 


ఈ కాలంలో పిల్లలు 10ఏళ్లకే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సితార, అధ్య కలిసి కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు. ఆ యూట్యూబ్ ఛానల్ లో పిల్లలకు ఎలాంటి వీడియోలు నచ్చుతాయో అలాంటి పెయింటింగ్స్, పేపర్ క్రాఫ్ట్స్ లాంటివి వీడియోల రూపంలో ఈ యూట్యూబ్ లో విడుదల చెయ్యనున్నారు. 


ఇప్పటికే ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక వీడియో విడుదల అయ్యింది. సితార ఈ ఛానల్ స్టార్ట్ చెయ్యడంతో మహేష్ బాబు అభిమానలు సంతోషం పట్టలేక పోతున్నారు. ఈ వీడియోని చుసిన మహేష్ బాబు అభిమానులు యూట్యూబ్ లో సితార సూపర్ స్టార్ అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా సితార ఈ యూట్యూబ్ ఛానల్ కి ఇప్పటికే దాదాపు వెయ్యి మంది 'సబ్ స్క్రైబ్' చెయ్యగా, ఈ వీడియోకి 3 వేల 'వ్యూస్' వచ్చాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: