తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు చాలా తక్కువ టైమ్‌లో తెలుగు,తమిళం, హిందీ భాషల్లో కథానాయికగా 50 సినిమాలను పూర్తి చేసుకుంది. అంతేకాదు తన తొలి చిత్ర దర్శకుడు తేజ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో 50 సినిమాల మైలురాయి అందుకుంది.

స్వామి రారా, కేశ‌వ వంటి విజ‌య‌వంత‌మైన సినిమాల‌కు ద‌ర్శ‌కత్వం వ‌హించి సుధీర్ వ‌ర్మ ఇపుడు తెలుగులో శ‌ర్వానంద్ హీరోగా ర‌ణ‌రంగం సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో శ‌ర్వానంద్ కు జోడిగా కాజ‌ల్ న‌టిస్తున్న‌ది..ఈ సినిమా ఆగ‌ష్టు 15 న విడుద‌ల‌ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.  కాజ‌ల్ హీరోయిన్ గా త‌మిళ్ లో జ‌యం ర‌వి హీరోగా కోమ‌లి సినిమా చేస్తున్న‌ది. ఆగ‌ష్టు 15 న విడుద‌ల‌వుతున్న  ఈ సినిమాపై త‌మిళంలో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. తెలుగు , త‌మిళ భాష‌ల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న కాజ‌ల్ న‌టించిన రెండు సినిమాలు, రెండు భాష‌ల సినిమాలు ఒకే రోజు విడుద‌ల‌వ‌డం విశేషం.  ఇందులో ఏ సినిమా హిట్ అయినా కాజ‌ల్ అగ్ర‌క‌థానాయిక‌గా కొంత‌కాలం కొన‌సాగగ‌ల‌ద‌ని సినీ వ‌ర్గాల వారి అంచ‌నా.. కాజ‌ల్ కోరిక కూడా....

ఇక‌పోతే ఈమ‌ధ్య కాలంలో కాజ‌ల్ న‌టించిన చిత్రం సీత‌. తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం మే 24న విడుద‌ల‌యింది. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌తో జ‌త‌క‌ట్టింది.  కాజ‌ల్ తొలిసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టించింది. ఎందుకో ఆ చిత్రం ఆశించినంత హిట్ కాలేక‌పోయింది. తిరిగి మ‌ళ్ళీ శ‌ర్వా తోచేసే చిత్రం మంచి హిట్ రావాల‌ని కోరుకుందాం.



మరింత సమాచారం తెలుసుకోండి: