స్థార్ హీరోల‌కు హిట్ సినిమాలు అందించిన బోయ‌పాటి శ్రీ‌ను గ‌త ఐదు నెల‌ల నుండీ ఖాళీగా ఉంటున్నారు. బోయ‌పాటితో సినిమాలు చేయ‌డం అంటే ఒక‌ప్పుడు స్టార్ హీరోలు క్యూ క‌ట్టేవారు. ఎప్పుడైతే ‘వినయ విధేయరామ’ డిజాస్ట‌ర్ అయిందో.. ఆ ఎఫెక్ట్ బోయ‌పాటిపై బాగా ప‌డింది. దీంతో ఆయ‌న‌తో సినిమా చేయ‌డానికి ఎవ‌రు ఒప్పుకోవ‌డం లేదు. ఒక‌ప్పుడు బాల‌య్య‌కు లెజెండ్‌, సింహా వంటి హిట్ సినిమాలు ఇచ్చిన బోయ‌పాటి.. ఎన్టీఆర్ బయోపిక్ సీరీస్ లోని రెండు సినిమాల తరువాత బాలకృష్ణ చేయబోయే సినిమా బోయ‌పాటితోనే అని బాల‌కృష్ణ హామీ ఇచ్చారు.


కానీ, ‘వినయ విధేయరామ’ ప్లాప్ ఎఫెక్ట్‌తో బాల‌కృష్ణ బోయ‌పాటిని ప‌క్క‌న పెట్టేశారు. ప్ర‌స్తుతం బాల‌య్య కెఎస్‌. ర‌వికుమార్‌తో ఓ సినిమా ప‌ట్టాలెక్కింది. ఈ క్రమంలో బోయపాటి శ్రీను సినిమా ఎప్పుడు ఉంటుందో ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదని ఈ మధ్య సోషల్ మీడియాలో వరుసగా వార్తలు వచ్చాయి.అయితే  ఎట్ట‌కేలకు ఆ వార్తలకు తెర ప‌డుతూ.. ఓ బ్యాన‌ర్‌పై బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించాడు. 


అయితే బోయపాటి – అల్లు అరవింద్ కాంబినేషన్ లో వచ్చే సినిమాలో హీరో ఎవ‌రు? అన్న ప్ర‌శ్న ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చర్చ న‌డుస్తోంది. అయితే మెగా హీరోల్లో ఎవరో ఒకళ్ళు హీరోగా నటిస్తారా..? లేదా వేరే హీరో ఎవరైనా నటిస్తారా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఐదు నెల‌ల నుంచి ఖాళీగా ఉన్న బోయ‌పాటికి అల్లు అర‌వింద్ రిలీఫ్‌ ఇచ్చిన‌ట్లు అయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: